పూరితో చేయడానికి రెడీ

ఒకప్పుడు ఏమో కానీ గత కొంత కాలం నుంచి బాలీవుడ్ వాళ్ళు మన సౌత్ సినిమాల పై కన్నేశారు. ఇక్కడ హిట్ సినిమాలని కొనడానికి చాలామంది మేకర్స్ [more]

Update: 2019-10-24 07:22 GMT

ఒకప్పుడు ఏమో కానీ గత కొంత కాలం నుంచి బాలీవుడ్ వాళ్ళు మన సౌత్ సినిమాల పై కన్నేశారు. ఇక్కడ హిట్ సినిమాలని కొనడానికి చాలామంది మేకర్స్ ట్రై చేస్తున్నారు. మన టాలెంట్ నచ్చితే ఇక్కడ డైరెక్టర్స్ తో అక్కడ సినిమాలు తీయడానికి వెనకాడడంలేదు బాలీవుడ్ వాళ్ళు. ఈ నేపధ్యంలోనే మన సౌత్ నుంచి ప్రియదర్శన్, ప్రభుదేవా, సందీప్ రెడ్డి, వంగ, లారెన్స్ వెళ్లి సక్సెస్ అయ్యారు. లారెన్స్ ప్రస్తుతం అక్కడ కాంచన రీమేక్ తో తన సత్తా చాటే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా చేరారు.

రీమేక్ సక్సెస్…

పూరి బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నాడు అని అర్ధం అవుతుంది. దానికి కారణం “పూరి సినిమా చేస్తానంటే నేను రెడీ” అంటూ కండల హీరో సల్మాన్ ఖాన్ సైతం స్వయంగా ఆఫర్ ఇచ్చారు. ఇక పూరి కథ రెడీ చేస్తే ఈ కాంబినేషన్ లో సినిమా ఓకే అయిపోతుంది. మరి పూరికి గోల్డెన్ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందో….సల్మాన్ ఖాన్ పూరితో చేస్తా అనడానికి ఓ కారణం ఉంది. పూరి తీసిన పోకిరి అక్కడ ‘వాంటెడ్’ పేరు తో రీమేక్ అయింది. అక్కడ ప్రభుదేవా దర్శకుడిగా ఈ మూవీ తో పరిచయమయ్యాడు. సల్మాన్ భాయ్ కి తొలి 100కోట్ల క్లబ్ సినిమాని ఇచ్చింది ఈ సినిమానే. ఇక అప్పటి నుంచి సల్మాన్ రికార్డ్స్ బ్రేక్ చేస్తూనే ఉన్నాడు. అందుకే పూరి తో సినిమా చేయాలనుకుంటున్నాడు సల్మాన్.

 

 

Tags:    

Similar News