త్రివిక్రమ్ కు ఆయనపై అంత మోజు ఏంటో..?
బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీపై త్రివిక్రమ్ కి అంత మోజు ఏంటో తెలియదు కానీ తన సినిమాల్లో దాదాపు ఉండేటట్టు చూసుకుంటున్నాడు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ “అత్తారింటికి [more]
బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీపై త్రివిక్రమ్ కి అంత మోజు ఏంటో తెలియదు కానీ తన సినిమాల్లో దాదాపు ఉండేటట్టు చూసుకుంటున్నాడు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ “అత్తారింటికి [more]
బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీపై త్రివిక్రమ్ కి అంత మోజు ఏంటో తెలియదు కానీ తన సినిమాల్లో దాదాపు ఉండేటట్టు చూసుకుంటున్నాడు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ “అత్తారింటికి దారేది” సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయిన బోమన్ ఇరానీ అందులో పవన్ కళ్యాణ్ కి తాతగా నటించాడు. ఆ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన మరో సినిమా “అజ్ఞాతవాసి” సినిమాలో బోమన్ ఇరానీ పవన్ కళ్యాణ్ తండ్రిగా నటించాడు.
అల్లు అర్జున్ తండ్రి పాత్రలో
ముచ్చటగా మూడోసారి ఆయన మళ్లీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయనున్నాడు. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో బోమన్ ఇరానీ అల్లు అర్జున్ కి తండ్రిగా నటించబోతున్నాడు. త్వరలోనే స్టార్ట్ అవ్వబోతున్న ఈ సినిమా తండ్రి – కొడుకుల నేపథ్యంలో నడుస్తుందట. గీత ఆర్ట్స్, హారిక హాసిని కలయికలో ఈ సినిమా రూపొందనుంది. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.