బోయపాటి అంతలా షాకిచ్చాడా సునీలూ!!

సునీల్ హీరో వేషాలు తగ్గాక మళ్ళీ కేరెక్టర్ ఆర్టిస్ట్ గానో, లేదంటే కమెడియన్ గానో మారి మళ్ళీ బిజీ అవుదామనుకుంటూ.. ఆశలు పెంచుకున్నాడు. కానీ సునీల్ కి [more]

Update: 2020-06-13 07:26 GMT

సునీల్ హీరో వేషాలు తగ్గాక మళ్ళీ కేరెక్టర్ ఆర్టిస్ట్ గానో, లేదంటే కమెడియన్ గానో మారి మళ్ళీ బిజీ అవుదామనుకుంటూ.. ఆశలు పెంచుకున్నాడు. కానీ సునీల్ కి అడుగడుగునా అవాంతరాలు. కమెడియన్ గా కాదు, కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను సునీల్ కి మళ్ళీ సక్సెస్ దక్కలేదు. కనీసం త్రివిక్రమ్ కూడా సునిల్ కి మంచి కేరెక్టర్స్ ని ఇవ్వలేకపొతున్నాడు. అయితే విలన్ గా అయినా సునీల్ ఆకట్టుకుంటాడు అనుకుంటే రవితేజ డిస్కో రాజా భారీ షాక్. తాజాగా బోయపాటి – బాలకృష్ణ సినిమాలో సునీల్ కి విలన్ కేరెక్టర్ అంటూ ప్రచారం జరగడంతో బాలయ్య ఫాన్స్ లో ఆందోళన. బాలయ్య ముందు కామెడీకి కూడా పనికిరాని సునీల్ బాలయ్య ముందు విలన్ గానా అంటూ తెగ వర్రీ అవుతున్నారు.

ఒకప్పుడు హీరోలను విలన్స్ గా మలచిన బోయపాటి ఇప్పుడు కమెడియన్ ని విలన్ గా మార్చడం ఏంట్రా బాబు అంటూ నందమూరి ఫాన్స్ కి టెంక్షన్ పట్టుకుంది. అయితే సునీల్ ని బోయపాటి బాలయ్య సినిమా కోసం సంప్రదించాడని కానీ విలన్ రోల్ కోసం కాదు… బాలయ్య పక్కన ఉండే కామెడీ రోల్ కోసమట. అయితే తాజాగా సునీల్ కి బోయపాటి భారీ షాకిచ్చినట్లుగా తెలుస్తుంది. బాలయ్య – బోయపాటి సినిమాకి కరోనా లాక్‌డౌన్‌కు ముందుగానే షూటింగ్ కొన్ని రోజులు జరిగింది. అయితే రెండున్నర నెలలు అనుకోకుండా బ్రేక్ రావడంతో బోయపాటి  స్క్రిప్ట్ మరోసారి చూసుకున్నాడు. ఎప్పటికప్పుడు మార్పులు చేయడానికి యిష్టపడే బోయపాటి.. ఆ మార్పుల్లో భాగంగానే సునీల్ కామెడీ ట్రాక్ మొత్తం ఎత్తేసాడని తెలుస్తుంది. ప్రస్తుతం బడ్జెట్ కంట్రోల అంటున్నారు. ఇప్పుడు ఇలా సునీల్ లాంటి కేరెక్టర్స్ తో కాలయాపన చేసేకన్నా ఆ కేరెక్టర్ తీసెయ్యడం మేలు నాయి అనుకున్నాడట బోయపాటి. ఇక సినిమాలో సునీల్ ట్రాక్ లేకపోయినా కూడా కథలో పెద్దగా మార్పులు కనిపించకపోవడంతో సునీల్ సీక్వెన్స్ అంతా తీసేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. 

Tags:    

Similar News