డిజాస్టర్ ఉంటే అంతేమరి

ఒక్క సినిమా ప్లాప్ అయ్యింది అంటే చాలు.. ఆ డైరెక్టర్ కి మళ్ళీ సినిమా రావడానికి చాలా టైం పడుతుంది. హీరో కైతే మార్కెట్ పడిపోతుంది. ఇక [more]

Update: 2019-11-09 08:06 GMT

ఒక్క సినిమా ప్లాప్ అయ్యింది అంటే చాలు.. ఆ డైరెక్టర్ కి మళ్ళీ సినిమా రావడానికి చాలా టైం పడుతుంది. హీరో కైతే మార్కెట్ పడిపోతుంది. ఇక దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలు చేసేటప్పుడు భారీగా పారితోషకాలు అందుకుంటారు. హీరోలకు సమానమైన పారితోషకాలు అడుగుతుంటారు. రాజమౌళి లాంటోళ్ళకి నిర్మాతలు అడిగింది ఇచ్చేస్తారు. అయితే కొరటాల, త్రివిక్రమ్, బోయపాటి లాంటి దర్శకులకు హిట్స్ ని బట్టి పారితోషకాలు ఉంటాయి. బోయపాటికి లెజెండ్, సింహ, సరైనోడు సినిమాలున్నప్పుడు 15 కోట్ల దాకా పారితోషకం అందుకునేవాడు. కానీ వినయ విధేయరామ డిజాస్టర్స్ తో బోయపాటికి అవకాశం రావడమే గగనం అయ్యింది.

అందుకే బాలకృష్ణ తో బోయపాటికి సినిమా రావడానికి 10 నెలల టైం పట్టింది. అయితే బోయపాటి అడిగింది ఇవ్వడానికి బాలయ్య రెడీ గా లేడట. అంటే పారితోషకం విషయంలో 15 కోట్ల పారితోషకం డిమాండ్ చేసే బోయపాటి ప్రస్తుతం నిర్మాతలు ఇచ్చింది తీసుకునే పొజిషన్ లో ఉన్నాడు. అందుకే బాలయ్య, బోయపాటికి కేవలం 7 నుండి 8 కోట్ల పారితోషకం ఫిక్స్ చేసాడట. బాలయ్య సొంత బ్యానర్ లో ఎన్ బీకే ఫిలిమ్స్ లోనే బోయపాటి, బాలయ్య సినిమాని తీస్తున్నాడు. ఈసారి పొలిటికల్ టచ్ లేకుండా, భారీ యాక్షన్ లేకుండా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా బోయపాటి, బాలయ్య సినిమా కథని రాసుకుని డెవెలెప్ చేస్తున్నాడట. డిసెంబర్ నుండి బోయపాటి – బాలయ్య సినిమా పట్టాలెక్కబోతుంది

Tags:    

Similar News