అక్షయ్ కుమార్ పై నెటిజన్స్ ఫైర్

అక్షయ్ నటించిన బచ్చన్ పాండే సినిమా ఈనెల 18న విడుదలైంది. సినిమాకు మంచి టాకే వచ్చింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకు..

Update: 2022-03-20 06:42 GMT

ముంబై : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. అక్షయ్ నటించిన బచ్చన్ పాండే సినిమా ఈనెల 18న విడుదలైంది. సినిమాకు మంచి టాకే వచ్చింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. కానీ.. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హింసాత్మక నేరస్థుడిగా కనిపిస్తాడు. ప్రజలను హత్యలు చేస్తూ.. హింసకు గురిచేస్తుంటాడు. అలాంటి సినిమాకు పాండే వంటి గొప్ప యోధుడి పేరును పెట్టడం పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

#BoycottBachchhanpandey హ్యాష్‌ట్యాగ్ పేరిట పోస్టులు చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. సినిమాలో హిందువులను కించపరిచేలా అక్షయ్ కుమార్ పాత్రను చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. కాగా.. తమిళలంలో వచ్చిన జిగర్తాండా సినిమాను తెలుగులో గద్దలకొండ గణేష్ గా రీమేక్ చేశారు. ఇప్పుడు ఆ సినిమానే హిందీలో బచ్చన్ పాండే రూపొందించారు. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, కృతి సనన్, అర్షద్ వార్సీ కీలక పాత్రల్లో నటించారు.


Tags:    

Similar News