బుచ్చి బాబు నెక్స్ట్ కూడా.. ?
సుకుమార్ రైటింగ్స్ ద్వారా, సుకుమార్ సపోర్ట్ తో ఫస్ట్ ఫిలిం ని బిగ్గెస్ట్ బడ్జెట్ తో చెయ్యగలిగే ఛాన్స్ దక్కించుకున్న బుచ్చి బాబు నిజంగానే అంచనాలను మించిన [more]
;
సుకుమార్ రైటింగ్స్ ద్వారా, సుకుమార్ సపోర్ట్ తో ఫస్ట్ ఫిలిం ని బిగ్గెస్ట్ బడ్జెట్ తో చెయ్యగలిగే ఛాన్స్ దక్కించుకున్న బుచ్చి బాబు నిజంగానే అంచనాలను మించిన [more]
సుకుమార్ రైటింగ్స్ ద్వారా, సుకుమార్ సపోర్ట్ తో ఫస్ట్ ఫిలిం ని బిగ్గెస్ట్ బడ్జెట్ తో చెయ్యగలిగే ఛాన్స్ దక్కించుకున్న బుచ్చి బాబు నిజంగానే అంచనాలను మించిన విజయాన్ని సాధించాడు. ఉప్పెనంత హిట్ కొట్టాడు. ఇండస్ట్రీ లోని అందరి ప్రశంశలు అందుకుంటున్నాడు. అంతేకాదు చాలామంది హీరోలు, నిర్మాతలు బుచ్చి బాబు పై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే బుచ్చిబాబు రెండో సినిమా కూడా ఆయన గురువుగారు సుకుమార్ డిసైడ్ చెయ్యాల్సిందే. గతంలో కుమారి 21 ఎఫ్ లాంటి హిట్ ఇచ్చిన సూర్య ప్రతాప్ ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు నిఖిల్ – అనుపమ కాంబోలో 18 పేజెస్ చిత్రాన్ని చేస్తున్నాడు.’
సుక్కు ఏ కాంబినేషన్ సెట్ చేసి.. ఏ ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాజెక్ట్ చెయ్యాల్సిందే. ఒకసారి వాళ్ళు బయటికి వెళ్లెవరకూ వాళ్ళకి సుకుమారే కేర్ టేకర్. అప్పుడు సూర్య ప్రతాప్ విషయంలో ఏదైతే జరిగిందో.. ఇప్పుడు బుచ్చి బాబు విషయంలోనూ అదే జరగబోతుంది. బుచ్చి బాబు సెకండ్ ప్రాజెక్ట్ కూడా సుకుమారే సెట్ చేస్తాడు. అయితే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు? ఎవరితో? అనేది తెలియదు. మరి ఉప్పెనంత హిట్ ఇచ్చినా కూడా వెయిటింగ్ తప్పదమ్మా బుచ్చి బాబూ..