అంతా ఫ్లాప్ బ్యాచ్.. అందుకే ఈ కోత..!

బెల్లంకొండ శ్రీనివాస్ తో ఏ దర్శకుడు, ఏ హీరోయిన్ పనిచేసినా వారికి ఎవరూ ఊహించని పారితోషకాలే అందుతాయి. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అంటే అంతా రిచ్ అన్నట్లు [more]

Update: 2019-04-30 09:04 GMT

బెల్లంకొండ శ్రీనివాస్ తో ఏ దర్శకుడు, ఏ హీరోయిన్ పనిచేసినా వారికి ఎవరూ ఊహించని పారితోషకాలే అందుతాయి. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అంటే అంతా రిచ్ అన్నట్లు ఉంటుంది వ్యవహారం. నిర్మాతలు కూడా బెల్లంకొండ సురేష్ ని చూసే శ్రీనివాస్ కి పెట్టుబడి పెడతారు. శ్రీనివాస్ మొదటి సినిమా నుండి అతని మార్కెట్ మీద కన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టడం.. ఆ పెట్టుబడి వెనక్కి తీసుకురావడానికి నిర్మాతలు నానా తంటాలు పాడడం అలవాటైపోయింది. అల్లుడు శీను దగ్గర నుండి సీత సినిమా వరకు బడ్జెట్ పరిమితులు లేకుండా బెల్లంకొండ సినిమాలు తెరకెక్కాయి. కానీ ఇపుడు మాత్రం బెల్లంకొండ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని.. మరీ సినిమాకి బడ్జెట్ పెడుతున్నారట.

ఈసారి బడ్జెట్ కంట్రోల్…

అలాగే బెల్లంకొండ చెయ్యబోయే తాజా చిత్రం తమిళ రచ్చసన్ రీమేక్ రాక్షసుడు సినిమాకి కేవలం 15 కోట్ల బడ్జెట్ మాత్రమే పెడుతున్నారట. ఆ సినిమాకి కేవలం 15 కోట్లు బడ్జెట్ కేటాయించారట. అయితే ఆ 15 కోట్లలో నటీనటుల పారితోషకాలు లేవంటున్నారు. నటీనటుల పారితోషకాలు కూడా ఓ అన్నంత లేకుండా నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారట. ఎందుకంటే బెల్లంకొండకి సూపర్ హిట్ లేదు. హీరోయిన్ అనుపమ వరుస ఫ్లాప్స్ తో ఉంది. ఇక దర్శకుడు రమేష్ వర్మ కూడా సాదాసీదా డైరెక్టర్. అందుకే బడ్జెట్ ని కంట్రోల్ చేశారట. అందులోనూ బెల్లంకొండ సినిమాలను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్స్ బెట్టు చేయడంతో.. ఈసారి బడ్జెట్ కంట్రోల్ చేసి మరీ సినిమాని తెరకెక్కించి తక్కువ ధరలకే డిస్ట్రిబ్యూటర్స్ కి అమ్మాలనే ప్లాన్ లో రాక్షసుడు టీం ఉందట.

Tags:    

Similar News