రాజమౌళి ప్లాన్ చేంజ్?

రాజమౌళి RRR షూటింగ్ మొదలు పెట్టడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. కరోనా కారణముగా RRR షూటింగ్ కి రెండున్నర నెలలుగా బ్రేకులు పడడంతో.. ఎప్పుడెప్పుడు షూటింగ్ చేద్దామా [more]

Update: 2020-06-07 16:28 GMT

రాజమౌళి RRR షూటింగ్ మొదలు పెట్టడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. కరోనా కారణముగా RRR షూటింగ్ కి రెండున్నర నెలలుగా బ్రేకులు పడడంతో.. ఎప్పుడెప్పుడు షూటింగ్ చేద్దామా అని ఎదురు చూస్తున్నాడు. అయితే ఇప్పుడు కరోనా కారణంగా సినిమా అనుకున్న టైం కి పూర్తయ్యేలా లేదని.. విడుదల కూడా లేట్ అయ్యేలా ఉంది అని RRR నిర్మాత తికమకగా సమాధానం చెప్పాడు. దానితో RRR జనవరి 8 నుండి మరో ఆరునెలలు వాయిదా పడడం పక్క అనే ప్రచారం జరుగుతుంది. అయితే RRR తర్వాత రాజమౌళి హీరో మహేష్ ఇది ఫిక్స్. రాజమౌళినే స్వయంగా చెప్పాడు. అంటే మహేష్ 28 వ దర్శకుడు రాజమౌళి అన్నమాట,

కానీ ఇప్పుడు రాజమౌళి ప్లాన్ ఛేంజ్ అంటున్నాడు. ఎందుకంటే RRR తో రెండున్నరేళ్లుగా కష్టపడుతున్న రాజమౌళి RRR తర్వాత ఓ ఆరు నెలల గ్యాప్ తీసుకుని రిలాక్స్ అవ్వనున్నాడని.. తర్వాతే మహేష్ తో మూవీ అంటుంటే వచ్చే ఏడాది ఈపాటికి పరశురామ్ సర్కారు వారి పాట విడుదలైయ్యాక.. మహేష్ ఫ్రీ అవుతాడు.మరి రాజమౌళి కోసం మహేష్ మరో 8 నెలలు వెయిట్ చేస్తాడా? లేదంటే తన 28 వ సినిమా కోసం మరో దర్శకుడిని వెతుకున్నా వెతుక్కోవచ్చనే న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

Tags:    

Similar News