గౌతమ్ తో చరణ్ ఫిక్స్!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్. ఆర్. ఆర్, కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్నా ఆచార్య కంప్లీట్ అయ్యాక రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఏమిటి అనే [more]

Update: 2021-02-11 07:17 GMT

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్. ఆర్. ఆర్, కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్నా ఆచార్య కంప్లీట్ అయ్యాక రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఏమిటి అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో వెంకీ కుడుముల, అనిల్ రావిపూడి, వంశి పైడిపల్లి పేర్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కాకుండా కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ సినిమా అనే గాసిప్ గట్టిగా వినిపిస్తుంది. ఒక వైపు ఇవన్నీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగానే.. రీసెంట్ గా తెలుస్తున్న సమాచారం ఏమిటి అంటే జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో తన నెక్స్ట్ ఫిలిం కి వర్క్ చేసేందుకు చాలా ఎక్కువ ఇంట్రెస్ చూపిస్తున్నాడు చరణ్.
గౌతమ్ తిన్ననూరి చెప్పిన ఏదో ఒక పాయింట్ కి చరణ్ బాగా కనెక్ట్ అయ్యాడట. గౌతమ్ తిన్నసూరి చెప్పిన ఆ పాయింట్ చరణ్ కి బాగా నచ్చడంతో చరణ్ తన నెక్స్ట్ మూవీని గౌతమ్ చేసేందుకు రెడీ అవుతున్నాడని టాక్ ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తుంది. ప్రస్తుతం గౌత తిన్ననూరి తన జెర్సీ సినిమాని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు. జెర్సీ రీమేక్ కంప్లీట్ చెయ్యగానే గౌతమ్ తో చరణ్ సినిమా చేసేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఆర్ ఆర్ ఆర్, ఆచార్య అవ్వగానే రామ్ చరణ్ జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితోనే తన నెక్స్ట్ ప్రాజెక్టు చేసేందుకు ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

Tags:    

Similar News