చరణ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా?
RRR హీరోల్లో ఎన్టీఆర్ తన తదుపరి మూవీ కోసం కమిట్మెంట్ ఇచ్చేసాడు. RRR షూటింగ్ అలా అవ్వడమే ఇలా త్రివిక్రమ్ మూవీ లోకి దిగిపోతాడు. కానీ చరణ్ [more]
RRR హీరోల్లో ఎన్టీఆర్ తన తదుపరి మూవీ కోసం కమిట్మెంట్ ఇచ్చేసాడు. RRR షూటింగ్ అలా అవ్వడమే ఇలా త్రివిక్రమ్ మూవీ లోకి దిగిపోతాడు. కానీ చరణ్ [more]
RRR హీరోల్లో ఎన్టీఆర్ తన తదుపరి మూవీ కోసం కమిట్మెంట్ ఇచ్చేసాడు. RRR షూటింగ్ అలా అవ్వడమే ఇలా త్రివిక్రమ్ మూవీ లోకి దిగిపోతాడు. కానీ చరణ్ చిరు ఆచార్య లో గెస్ట్ రోల్ అయ్యాక తన తదుపరి మూవీ విషయంలో ఓ కొలిక్కి రాలేకపోతున్నాడు. రామ్ చరణ్ లాక్ డౌన్ లో చాలా కథలు విన్నాడు. కానీ ఏ మూవీ కి ఓకె చెప్పలేదు. తండ్రి సినిమాలను సెట్ చేసుకుంటూ కూర్చున్నాడు. కుర్ర హీరోలా చిరు కూడా సినిమాల మీద సినిమాలు కమిట్ అవుతుంటే రామ్ చరణ్ మాత్రం ఎందుకో ఇంకా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అయితే తాజాగా రామ్ చరణ్ సేఫ్ గేమ్ ఆడాలనుకుంటున్నాడట. అది కూడా పాన్ ఇండియా లెవెల్ లో.
అంటే RRR తర్వాత రామ్ చరణ్ మళ్లీ పాన్ ఇండియా మూవీ చెయ్యాలనుకుంటున్నాడట. అందులో భాగంగా ఓ తమిళ రీమేక్ రైట్స్ ని రామ్ చరణ్ సొంతం చేసుకోవడమే కాకుండా చరణ్ ఆ రీమేక్ దర్శకుడితో పాన్ ఇండియా లెవల్లో మూవీ ఓకె చేసుకుంటున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో వినబడుతుంది. రామ్ చరణ్ గతంలో తమిళ్ లో హిట్ అయిన తనిఒరువన్ కి రీమేక్ గా ధ్రువ సినిమా చేసి భారీ హిట్ కొట్టాడు. ఇక తాజాగా తనిఒరువన్ 2 వెర్షన్ రాబోతుంది. ఆ సినిమాకి రీమేక్ రైట్స్ చరణ్ తీసుకున్నాడని… తనిఒరువన్ 2 రీమేక్ ని చరణ్ లో చేస్తాడని అంటున్నారు.
అయితే తనిఒరువన్ దర్శకుడు మోహన్ రాజా ఓ పాన్ ఇండియా కథని చరణ్ కి వినిపించాడట. కథ నచ్చిన రామ్ చరణ్ ఆ సినిమాని పాన్ ఇండియా లెవల్ కి చెయ్యాలని డిసైడ్ అయ్యాడని తెలుస్తుంది. మరి రామ్ చరణ్ RRR, ఆచార్య తర్వాత తనిఒరువన్ 2 రీమేక్ చేస్తాడా? లేదంటే మోహన్ రాజా చెప్పిన పాన్ ఇండియా కథతో సినిమా చేస్తాడో? అనేది చరణ్ క్లారిటీ ఇస్తే బావుంటుంది.