త్రిష.. నన్ను పెళ్లి చేసుకో..!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన త్రిష, ఛార్మీ మధ్య మంచి స్నేహం ఉంది. పలు సందర్భాల్లో వీరు తమ స్నేహాన్ని సోషల్ మీడియా వేదికగా, పలు [more]

Update: 2019-05-04 12:40 GMT

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన త్రిష, ఛార్మీ మధ్య మంచి స్నేహం ఉంది. పలు సందర్భాల్లో వీరు తమ స్నేహాన్ని సోషల్ మీడియా వేదికగా, పలు ఈవెంట్లలో బయటపెట్టుకుంటారు. తాజాగా త్రిష పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ లో జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ఛార్మీ ఓ సరదా ట్వీట్ చేసింది. ‘‘బేబీ.. ఇవాళే కాదు ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తాను. మోకాళ్లపై కూర్చొని కోరుతున్నా.. నా ప్రతిపాదనను అంగీకరించు. మనం పెళ్లి చేసుకుందాం.(ఇప్పుడు ఇది చట్టబద్ధం కూడా)’’ అంటూ ట్వీట్ చేసింది. గతంలోనూ ఛార్మీ ఇటువంటి ట్వీట్ ఒకటి చేయగా త్రిష కూడా రిప్లై ఇచ్చింది.

http://

https://platform.twitter.com/widgets.js

Tags:    

Similar News