సింగర్ సునీత నిశ్చితార్థం ఆయనతోనే

ప్రముఖ గాయని సునీత వివాహంపై వస్తున్న రూమర్లకు చెక్‌ పడింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు [more]

Update: 2020-12-07 07:35 GMT

ప్రముఖ గాయని సునీత వివాహంపై వస్తున్న రూమర్లకు చెక్‌ పడింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు డిజిటల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న బిజినెస్ మెన్‌ రామ్‌ వీరపనేనితో సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్‌గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా 19 ఏళ్ల వయసులోనే సునీతకు పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయి విడాకులు తీసుకున్న సునీత పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు.

Tags:    

Similar News