మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణిపై నాన్ బెయిలబుల్ వారెంట్

ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది

Update: 2023-08-29 02:11 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ముకుంద్ చంద్ బోత్రా అనే సినిమా ఫైనాన్షియర్ 2016లో ఓ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన కారణంగా తాను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో సెల్వమణి ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ముకుంద్‌చంద్.. సెల్వమణిపై పరువునష్టం దావా వేశారు. ఆ తర్వాత ముకుంద్‌చంద్ చనిపోయినా ఆయన కుమారుడు గగన్‌బోత్రా ఈ కేసును కొనసాగిస్తున్నారు. సోమవారం ఈ కేసు విచారణ జరగ్గా సెల్వమణి కోర్టుకు హాజరు కాలేదు. దీంతో చెన్నై జార్జ్‌టౌన్ కోర్టు ఆయనపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ తదుపరి విచారణను సెప్టెంబరు 22కు వాయిదా వేసింది.

విచారణ సందర్భంగా, ఆర్‌కె సెల్వమణి కోర్టు హాజరు అవ్వలేదు. కనీసం ఆయన తరపున న్యాయవాదులు కూడా హాజరుకాలేదని తెలుస్తోంది. గతంలో 2016లో ఆర్కే సెల్వమణి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బరసు ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో సెల్వమణి ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోత్రాపై పలు విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. దీంతో బోత్రా వారిపై జార్జ్‌టౌన్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. బోత్రా మరణం తర్వాత ఆయన కుమారుడు గగన్ బోత్రా కేసును కొనసాగిస్తున్నారు.


Tags:    

Similar News