చరణ్ - ఉపాసన ల కూతురి పేరు చెప్పిన చిరంజీవి

ఇక ఈ రోజు మెగా వారసురాలి బారసాల కావడంతో.. ఉదయం నుంచి మళ్లీ మెగా ప్రిన్సెస్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు.

Update: 2023-06-30 12:09 GMT

రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు 10 రోజుల క్రితం పాప పుట్టిన విషయం తెలిసిందే. పాప పుట్టినప్పటి నుంచీ ఏ పేరు పెడతారా అని మెగా ఫ్యాన్స్ తెగ చర్చించుకున్నారు. ఇక ఈ రోజు మెగా వారసురాలి బారసాల కావడంతో.. ఉదయం నుంచి మళ్లీ మెగా ప్రిన్సెస్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు మెగా ప్రిన్సెస్ పేరు ప్రకటించారు. క్లిన్ కారా కొణిదెల అని నిర్ణయించారు. ఈ పేరు పెట్టడానికి గల కారణం కూడా తెలిపారు.

లలితా సహస్రనామాల నుంచి ఈ పేరును తీసుకున్నట్లు వివరించారు. ఈ పేరు ఆధ్యాత్మిక చింతనను, పాజిటివిటీని ఇస్తుందన్నారు. తమ వారసురాలికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ పేరును పెట్టినట్లు తెలిపారు. పాప బారసాల సందర్భంగా చరణ్-ఉపాసన, చిరంజీవి దంపతులు, ఉపాసన తల్లిదండ్రులు కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా.. ఉపాసన డెలివరీ అపోలో ఆసుపత్రిలోనే జరిగినా.. అందుకోసం మెగా ఫ్యామిలీ రూ.3 కోట్లు ఖర్చుచేసిందని ఇటీవల వార్తలొచ్చాయి.


Tags:    

Similar News