చిరు బర్త్ డే గిఫ్ట్ అదేనా?

మరో 20 రోజుల్లో చిరంజీవి పుట్టిన రోజు రాబోతుంది. ఆగష్టు 22 న చిరు పుట్టిన రోజుకి ఆచార్య లోని లుక్ అయినా, టీజర్ అయినా కొరటాల [more]

Update: 2020-08-04 07:18 GMT

మరో 20 రోజుల్లో చిరంజీవి పుట్టిన రోజు రాబోతుంది. ఆగష్టు 22 న చిరు పుట్టిన రోజుకి ఆచార్య లోని లుక్ అయినా, టీజర్ అయినా కొరటాల ప్లాన్ చేస్తున్నాడు లేదో తెలియక మెగా ఫాన్స్ తికమక పడుతున్నారు. చిరు పుట్టిన రోజు కానుకగా ఆచార్య లుక్ కోసం మెగా ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజునాడు RRR స్పెషల్ వీడియో తో పండగ చేసుకున్న మెగా ఫాన్స్ ఇప్పుడు ఆగష్టు లో చిరు బర్త్ డే కోసం ఎప్పుడు తెగ ఎదురు చూస్తున్నారు. తాజాగా చిరు పుట్టిన రోజు సమీపిస్తుండడంతో కొరటాలకి ఆచార్య లుక్ అండ్ టీజర్ కోసం రిక్వెస్ట్ లు పెడుతున్నారు. అయితే చిరు పుట్టిన రోజుకి ఆచార్య కి సంబందించిన స్పెషల్ వస్తుందో లేదో కానీ.. ఇప్పుడు మరో న్యూస్ మాత్రం తెగ హైలెట్ అవుతుంది.

అది చిరంజీవి లూసిఫెర్ రీమేక్ ని పక్కనబెట్టి దర్శకుడు బాబీ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ నడుస్తుంది. బాబీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చిన చిరు బాబీ తో పూర్తి స్క్రిప్ట్ ని తీసుకు వస్తే.. సినిమా మొదలు పెడదామని చెప్పాడని.. బాబీ – చిరు కంబోకి సంబందించిన అధికారిక ప్రకటన చిరు పుట్టిన రోజుఅన్దే ఇవ్వబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం చిరు కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా సెట్స్ మీదుండగా బాబీ ని లైన్ లో పెట్టి సినిమా కమిట్ చేసి ఆచార్య షూట్ ఫినిష్ కాగానే బాబీ సినిమాని పట్టాలెక్కించి ప్లాన్ చిరు అండ్ రామ్ చరణ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియా టాక్.

Tags:    

Similar News