న‌ట‌ గురువుకు చిరంజీవి నివాళి

ద‌ర్శక‌న‌టుడు.. న‌ట‌గురువు దేవ‌దాస్ క‌న‌కాల (75) అనారోగ్యంతో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. శ‌నివారం ఉదయం కొండాపూర్ కిమ్స్ నుంచి మణికొండ మర్రిచెట్టు స‌మీపంలోని ఆయ‌న‌ స్వగృహానికి [more]

Update: 2019-08-03 13:27 GMT

ద‌ర్శక‌న‌టుడు.. న‌ట‌గురువు దేవ‌దాస్ క‌న‌కాల (75) అనారోగ్యంతో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. శ‌నివారం ఉదయం కొండాపూర్ కిమ్స్ నుంచి మణికొండ మర్రిచెట్టు స‌మీపంలోని ఆయ‌న‌ స్వగృహానికి పార్థీవ దేహాన్ని తీసుకొచ్చారు. అనంత‌రం హైద‌రాబాద్ మ‌హాప్రస్థానంలో దహన సంస్కరాలు పూర్తి చేశారు. తనయుడు రాజీవ్ కనకాల అంత్యక్రియలను పూర్తి చేశారు.

తనకు శిక్షణ ఇచ్చిన….

న‌ట‌గురువు క‌న‌కాల మృతి ప‌ట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయ‌న‌ పార్థీవ దేహాన్ని సంద‌ర్శించుకున్న అనంత‌రం క‌న‌కాల‌ కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నాటక రంగం నుండి సినిమా రంగంలోకి ప్రవేశించిన దేవదాస్ కనకాల టాలీవుడ్ లో ఎంద‌రో న‌టీన‌టుల్ని తీర్చిదిద్దారు. చిరంజీవి, రాజేంద్రప్రసాద్ త‌దిత‌రుల‌కు ఆయ‌న న‌ట‌న‌లో శిక్షణ‌నిచ్చారు.

Tags:    

Similar News