చిరు అంటే మాములు విషయం కాదు

ఇండస్ట్రీలో చిరు కి మెగాస్టార్ స్థానం ఉంది. దాసరి తర్వాత మెగాస్టార్ చిరు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారాడు. కరోనా టైం లో చారిటి ప్రారంభం దగ్గరనుండి.. [more]

Update: 2020-12-21 06:17 GMT

ఇండస్ట్రీలో చిరు కి మెగాస్టార్ స్థానం ఉంది. దాసరి తర్వాత మెగాస్టార్ చిరు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారాడు. కరోనా టైం లో చారిటి ప్రారంభం దగ్గరనుండి.. సినిమా షూటింగ్స్ అనుమతుల కోసం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల చుట్టూ తిరిగి అనుమతులు తేవడం వరకు చిరు కీ రోల్ ప్లే చేసాడు. తాజాగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ కి తన సినిమాల్లో అవకాశాల జల్లు కురిపించాడు. నాగార్జున హోస్ట్ గా చిరు గెస్ట్ గా జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో చిరు దివి కి తన వేదాళం సినిమా లో ఓ రోల్ ఇవ్వమని మెహర్ తో మాట్లాడినట్లుగా చెప్పడంతో దివి ఒక్కసారిగా షాకయ్యింది. అంతేకాకుండా మెహబూబ్ కి 10 లక్షల చెక్ ఇచ్చి అందరిని ఆశ్చర్యంలో పడేసాడు.

ప్రతి కంటెస్టెంట్స్ తో చిరంజీవి మాట్లాడుతూ అవినాష్ కామెడీ నచ్చింది అని, సోహైల్ కథ వేరే ఉంటది అనే డైలాగు బావుంది అని, మెగబూబ్ లో తనని తాను చూసుకున్న అని, దివి తో మట్లాడుతూ మెలికలు తిరిగిన చిరును నాగ్ కంట్రోల్ చెయ్యడంతో బిగ్ బాస్ స్టేజ్ మీద నవ్వులు పూశాయి. అలాగే లాస్య నవ్వు చూస్తే మా ఇంట్లో అమ్మాయిలా అనిపించావని.. హారిక తో తన పాత సినిమా సాంగ్ గుర్తొచ్చింది అంటూ నాగ్ చూడకుండా హరికకి రోజ్ ఫ్లవర్ చూపించడం అబ్బా చిరు బిగ్ బాస్ స్టేజ్ మీద అదరగొట్టేసాడనుకోండి. ప్రతి ఒక్కరితో పేరు పేరున మాట్లాడిన చిరు కి విన్నర్ అభిజిత్ పాదాభివందనం చేసాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో ఆభిజీత్ కేరెక్టర్ చాలా సెటిల్డ్ గా ఉన్నట్టుగానే అభిజిత్ నిజ జీవితంలోను అన్ని ఎమోషన్స్ క్యారీ చేసే యువకుడిగా ఉన్నాడని మెచ్చుకున్నాడు. ఇక అఖిల్ పులిహోరని కామెడీ చేసి చూపించాడు చిరు. మోనాల్ నీకు సినిమా అవకాశాలు వస్తున్నాయని విన్నా అంటూ మోనాల్ ని సర్ప్రైజ చేసిన చిరు కామెడీ.. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి మెయిన్ హైలెట్ గా నిలిచింది.

Tags:    

Similar News