ఆ న్యూస్ లో నిజం లేదు

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ ఓ రూపొందుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా చిరంజీవి ఈమూవీ గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. [more]

Update: 2019-08-19 09:02 GMT

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ ఓ రూపొందుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా చిరంజీవి ఈమూవీ గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. ” స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ స్టేజి లో ఉంది. ఈసినిమాలో పని చేసే టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారు. నటీనటులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈమూవీలో నేను డ్యూయల్ రోల్ చేస్తున్నానని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు” అని చిరు క్లారిటీ ఇచ్చారు.

త్వరలోనే చిరు లుక్…..

త్వరలోనే చిరంజీవి లుక్ కి సంబంధించి టెస్ట్ జరగనుందట. దీన్ని బట్టే ఈ సినిమాలో చిరు గెటప్ ను డిసైడ్ చెయ్యాలని కొరటాల ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చాలామంది హీరోయిన్స్ అనుకున్న తరువాత కాజల్ అగర్వాల్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. చిరు పుట్టినరోజు అంటే ఆగస్టు 22 న ఈమూవీ కి సంబంధించి పూజా కారిక్రమాలు జరగున్నాయి. ఇక చిరు కోసం కొరటాల మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసారట. చిరు ప్రస్తుతం చేస్తున్న సైరా రిలీజ్ తరువాత ఈసినిమాపై ఫోకస్ పెట్టుకున్నాడు. సైరా సినిమా అక్టోబర్ 2 న రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.

Tags:    

Similar News