స్టార్ హీరోలపై ఇండైరెక్ట్ పంచ్ పడిందా?
ఇండస్ట్రీలో స్టార్ హీరోలంతా ఇప్పుడు కారవాన్‌లంటూ కోట్లకి కోట్లు వెచ్చిస్తున్నారు. ఈమధ్యన కారవాన్‌ల విషం బాగా హైలెట్ అయ్యింది. ఎందుకంటే అల్లు అర్జున్, మహేష్ లు కోట్లు [more]
ఇండస్ట్రీలో స్టార్ హీరోలంతా ఇప్పుడు కారవాన్‌లంటూ కోట్లకి కోట్లు వెచ్చిస్తున్నారు. ఈమధ్యన కారవాన్‌ల విషం బాగా హైలెట్ అయ్యింది. ఎందుకంటే అల్లు అర్జున్, మహేష్ లు కోట్లు [more]
ఇండస్ట్రీలో స్టార్ హీరోలంతా ఇప్పుడు కారవాన్‌లంటూ కోట్లకి కోట్లు వెచ్చిస్తున్నారు. ఈమధ్యన కారవాన్‌ల విషం బాగా హైలెట్ అయ్యింది. ఎందుకంటే అల్లు అర్జున్, మహేష్ లు కోట్లు ఖర్చు పెట్టి అన్ని వసుతుల్తో ఖరీదైన కారవాన్‌ల ని తెప్పించుకున్నారు. అయితే షూటింగ్ విరామ సమయంలో హీరోస్ చాలామంది ఇలా కారవాన్‌ల లో రిలాక్స్ అవుతుంటారు. ఇప్పుడు ఈ ఖరీదైన కారవాన్‌ల విషయంలో ఇండస్ట్రీ పెద్ద తలకాయ మెగాస్టార్ చిరు ఫైర్ అవ్వడమే కాదు…. స్టార్ హీరోలకు ఇండైరెక్ట్ పంచ్ వేసాడు. అదేమంటే ఒకప్పటిలా ఇండస్ట్రీలో పరిస్థితులు ఇప్పుడు లేవు . మా కాలంలో ఆడవాళ్ళకి కారవాన్ ఉంటే బావుండేది అనిపించేది. ఎందుకంటే వారికీ డ్రెస్ చేంజ్ కోసం, వాష్ రూమ్స్ కోసం. ఇక మేము సినిమాలు చేసినపుడు అసలు ఈ కారవాన్‌ల గోల లేదు. శంకర్ దాదా టైం లో కూడా లేవు. నేను మళ్ళి ఖైదీ నెంబర్ 150 తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పటికీ.. ఇండస్ట్రీలో చాలా మార్పులొచ్చాయి.
అందులో ముఖ్యంగా షూటింగ్ లొకేషన్స్ దగ్గర కారవాన్‌ల గోల ఎక్కువైంది. కారవాన్ లలో రిలాక్స్ అయ్యే హీరోలను పిలవడానికి అసిస్టెంట్ డైరెక్టర్ వెళితే అతనికి సినిమాలో నేర్చుకోవడానికి ఏం ఉండదు.. హీరోలను పిలవడానికి అతని టైం సరిపోతుంది. నేను అయితే కారవాన్ ని డ్రెస్ చేంజ్ కోసం, వాష్ రూమ్ కోసం, మేకప్ వేసుకోవడానికి మత్రమే వాడతాను. ఇక షూటింగ్ సమయంలో నా పార్ట్ అయ్యిపోతే.. అక్కడే ఉంటాను తప్పించి. కారవాన్ లోకి వెళ్ళను. లొకేషన్ లో దర్శకులకు అందుబాటులో ఉంటే.. పనులు త్వరగా అవుతాయి. అలాగే మనం గనక రిలాక్స్ మోడ్ కి వెళ్ళామంటే మిగతావారు రిలాక్స్ అవుతారు.. దానితో ఆ ఎఫెక్ట్ సినిమా అవుట్ ఫుట్ మీద పడుతుంది.. బడ్జెట్ క్రమంగా పెరుగుతుంది. ఈ విషయంలో చాలా మార్పులు రావాల్సి ఉంది. అసలు స్టార్ హీరోలందరికీ.. కారవాన్ అనేది ప్రెస్టీజ్ ఇష్యు అయ్యింది అంటూ స్టార్ హీరోలను వరసబెట్టి.. క్లాస్ పీకినట్లుగా పీకాడు మెగాస్టార్ చిరు.