కొత్త పని మొదలుపెట్టిన చిరు

చిరంజీవి సినిమాల్లో స్టార్ హోదాలో నెంబర్ 1 స్థానాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ ఫిట్ గా ఉండేవాడు. శంకర్ దాదా జిందాబాద్ టైంలో కాస్త ఒళ్ళు చేసినా… ఆ [more]

Update: 2019-01-25 06:34 GMT

చిరంజీవి సినిమాల్లో స్టార్ హోదాలో నెంబర్ 1 స్థానాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ ఫిట్ గా ఉండేవాడు. శంకర్ దాదా జిందాబాద్ టైంలో కాస్త ఒళ్ళు చేసినా… ఆ తరవాత మళ్ళీ చిరు ఎప్పటి లాగే.. ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. కానీ రాజకీయాల పుణ్యమా అని ఫిట్నెస్ ని పక్కన పెట్టిన చిరు… మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక బరువు తగ్గడానికి చాలా కష్టపడ్డాడు. ఏదో కాస్త బరువు తగ్గినా ఖైదీ నెంబర్ 150లో డాన్స్ లలో మాత్రం చిరు బాగా ఇబ్బంది పడ్డాడు. ఇక సైరా సినిమాలో నటిస్తున్న చిరంజీవి కొన్నిసార్లు సన్నగా.. మరికొన్నిసార్లు లావుగా కనబడుతున్నాడు. మొదట్లో చిరు అధిక బరువు సమస్య వలన సైరా షూటింగ్ వాయిదా వేశారనే ప్రచారమూ జరిగింది.

మళ్లీ బరువు తగ్గే పనిలో…

ప్రస్తుతం సైరా సినిమా షూటింగ్ లో బాగా బిజీగా ఉన్న చిరంజీవి.. కాస్త ఒళ్ళు చేసినట్టుగా కనిపిస్తున్నాడు. తాజాగా చిరు హాజరవుతున్న ఈవెంట్స్ లో చిరు బరువు తెలుస్తోనే ఉంది. మరి సైరా కోసం ఒకసారి తగ్గడం, ఒకసారి పెరగడం చేస్తున్న చిరు ఇప్పుడు మరో డైరెక్టర్ కోసం తగ్గబోతున్నాడట. సైరా తర్వాత కోరటాలతో సినిమాకు కమిట్ అయ్యాడు చిరు. కొరటాల – చిరు మూవీ ఆఫీసియల్ ఎనౌన్సమెంట్ కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమా వచ్చే ఏప్రిల్ నుండి లేదా మే ఫస్ట్ వీక్ నుండి మొదలు కాబోతుంది. ఇక చిరు కోసం కొరటాల రెడీ చేసిన కథలో చిరు పాత్ర చాలా చురుగ్గా, చలాకీగా కనిపించాలట. మరి అలా స్పీడుగా ఉండాలంటే ముందు చిరంజీవి అధిక బరువుతో కనబడితే కుదరదట. అందుకే చిరు తన వెయిట్ ని కంట్రోల్ చేసుకోవాలి అని చెబుతున్నారు. దీంతో చిరు ఇప్పటినుండే తగ్గే ప్లాన్ చేసుకుంటున్నాడట.

Tags:    

Similar News