ఉగాది రోజున సోష‌ల్ మీడియాలోకి ఎంటర్ అవ్వనున్న మెగాస్టార్ చిరంజీవి

నేడు కొత్త తెలుగు సంవ‌త్స‌రాది..ఉగాది. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. ఉగాది రోజున తాను సోష‌ల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ఆయ‌న [more]

Update: 2020-03-25 04:22 GMT

నేడు కొత్త తెలుగు సంవ‌త్స‌రాది..ఉగాది. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. ఉగాది రోజున తాను సోష‌ల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ఆయ‌న వీడియో సందేశాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

‘‘ఇక నుండి నేను కూడా సోష‌ల్ మీడియాలోకి ఎంట‌ర్ అవుదామ‌ని అనుకుంటున్నాను. అందుకు కార‌ణం ఎప్ప‌టిక‌ప్పుడు నా భావాల‌ను నా అభిమానుల‌తో షేర్ చేసుకోవ‌డానికి నేను చెప్పాల‌నుకున్న మెసేజ్‌ల‌ను ప్ర‌జ‌ల‌తో చెప్పుకోవ‌డానికి సోష‌ల్ మీడియాను వేదిక‌గా భావిస్తున్నా..నేను ఈ ఉగాది రోజు నుండి సోష‌ల్ మీడియాలోకి ఎంట‌ర్ అవుతున్నాను’’ అని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.

Tags:    

Similar News