అమితాబ్‌ కు అభినందనలు

లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. 1969లో చిత్రసీమలోకి [more]

Update: 2019-09-25 12:50 GMT

లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. 1969లో చిత్రసీమలోకి అడుగుపెట్టిన అమితాబ్ బచ్చన్ స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. గడిచిన యాభై వసంతాల కాలంలో చరిత్రలో నిలిచిపోయే చిత్రాలెన్నింటిలోనూ నటించి మెప్పించారని చిరంజీవి కొనియాడారు. యుక్తవయసులో యాంగ్రీ యంగ్ మెన్ అనిపించుకున్న అమితాబ్ … ఇప్పుడు వైవిధ్యమైన కథాంశాలను ఎంపిక చేసుకుని, తాను పోషించే ప్రతి పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారని, మా అబ్బాయి రామ్ చరణ్‌ నిర్మించిన, ‘సైరా… నరసింహారెడ్డి’ చిత్రంలోనూ నా గురువు గోసాయి వెంకన్న పాత్రను ఆయన పోషించడం నాకెంతో ఆనందాన్ని కలిగించిందంటున్నారు చిరంజీవి. ఈ చిత్రం విడుదల కాబోతున్న శుభతరుణంలో అమితాబ్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే పద్మశ్రీ,, పద్మభూషణ్‌, పద్మ విభూషణ్ పురస్కారాలు పొందిన అమితాబ్ బచ్చన్ కు చిత్రసీమకు చెందిన అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ పురస్కారానికి ఎంపిక కావడం మా యూనిట్ మొత్తంలో ఆనందోత్సాహాలను నింపిందని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.

 

Tags:    

Similar News