సీనియర్ సూపర్ స్టార్స్ ఏది చేసినా కరక్టే…!

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి కన్నా ఎక్కువ క్రేజ్ తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉంటుంది. ఇద్దరూ సమానమైన అభిమాన గణాన్ని కలిగి ఉన్నారు. అలాగే ఇపుడు [more]

Update: 2019-02-12 06:12 GMT

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి కన్నా ఎక్కువ క్రేజ్ తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉంటుంది. ఇద్దరూ సమానమైన అభిమాన గణాన్ని కలిగి ఉన్నారు. అలాగే ఇపుడు కూతుళ్ల‌ విషయంలోనూ ఇద్దరు ఒక్కతీరుగానే ఆలోచించారు. అదెలా అంటే… చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఓ వ్య‌క్తిని ప్రేమించి అందరిని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. త‌ర్వాత వారు వేర్ప‌డ్డారు. ఇక చిరంజీవి.. కూతురు శ్రీజని అక్కున చేర్చుకోవడమే కాదు… కొన్నాళ్ల‌కు శ్రీజకి ఆమె చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్ దేవ్ నిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేసాడు. అలాగే ఇండస్ట్రీ, పోలిటిషన్స్ సెలెబ్రెటీస్ ని పిలిచి విందు ఇచ్చాడు. ఇక శ్రీజ – కళ్యాణ్ దేవ్ లకు తాజాగా కూతురు కూడా పుట్టింది.

అంగ‌రంగ వైభ‌వంగా…

ఇక తమిళ సూపర్ స్టార్ రజ‌నీకాంత్ తన కూతురు సౌందర్య కూడా ఒక బిడ్డతో భర్తకు విడాకులిచ్చేసి వచ్చేస్తే.. అక్కున చేర్చుకున్నాడు. మళ్లీ సౌందర్య మరో వ్యక్తిని ప్రేమించడం.. దానికి రజ‌నీ ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు.. నిన్న చెన్నై లో అతిరధ మహారథుల మధ్యన అంగరంగ వైభవంగా పెళ్లి చేసాడు. ఈ పెళ్లికి పొలిటికల్ లీడర్స్, తమిళనాడు సీఎం పళ‌ని స్వామి, స్టాలిన్, రజ‌నీ స్నేహితుడు కమల్ హాసన్, టాలీవుడ్ నుండి మంచు ఫ్యామిలీ, రాజశేఖర్ ఫ్యామిలీ హాజరయ్యారు. మరి తమ కూతుళ్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురైనా సూప‌ర్స్ స్టార్స్ ఇద్దరూ తమ కూతుళ్ల‌కు మళ్లీ మంచి జీవితాన్ని అందించారు. ఇక ఆ పెళ్ళిళ్లు ఏదో గుట్టు చప్పుడు కాకుండా కాదు… అందరికీ తెలిసేలా అంగరంగ వైభవంగా అతిథుల సమక్షంలో నిర్వహించడం చూస్తుంటే…. సూపర్ స్టార్స్ ఏది చేసినా కరెక్ట్ అనిపించడం లేదూ…!

Tags:    

Similar News