కొన్నాళ్ళు నన్ను బ్యాన్ చేశారు.. చిరంజీవి కామెంట్స్..

నేషనల్ మీడియాలు సైతం చిరంజీవి పై.. 'బిగ్గెర్ థెన్ బచ్చన్' అంటూ ప్రత్యేక ఆర్టికల్స్ రాసి, చిరు మ్యాగజైన్ స్టిల్స్ కోసం ఎదురు చూసేవారు. అలాంటి చిరంజీవిని..

Update: 2023-10-14 08:07 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశబ్దాలు కాలంగా తెలుగు సినీ పరిశ్రమని ఏలుతూ వస్తున్నాడు. ఇక 19's టైములో అయితే చిరంజీవి తన సినిమాలతో సంచలనం సృష్టిస్తూ ఇండియా వైడ్ రీసౌండ్ చేస్తూ వచ్చాడు. నేషనల్ మీడియాలు సైతం చిరంజీవి పై.. 'బిగ్గెర్ థెన్ బచ్చన్' అంటూ ప్రత్యేక ఆర్టికల్స్ రాసి, చిరు మ్యాగజైన్ స్టిల్స్ కోసం ఎదురు చూసేవారు.

అలాంటి చిరంజీవిని తెలుగు మీడియా వాళ్ళు కొన్నాళ్ళు బ్యాన్ చేశారట. ఈ విషయాన్ని రీసెంట్ గా చిరంజీవి ఒక ప్రెస్ మీట్ లో తెలియజేశాడు. 'మెకానిక్ అల్లుడు' సినిమా షూటింగ్ సమయంలో ఈ విషయం జరిగిందట. ఆ సినిమాలో చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించారు. ఒకప్పుడు సినిమాకి సంబంధించి సితార, శివరంజని, జ్యోతి చిత్ర.. వంటి సినిమా మ్యాగజైన్స్ ఉండేవి. ఈ మ్యాగజైన్ లో తమ స్టిల్స్ రావడం.. ఇండస్ట్రీలోని స్టార్స్ అంతా ఎంతో సంతోషంగా భావించేవారు.
అయితే మెకానిక్ అల్లుడు టైములో ఒక మూడు వారాలు చిరంజీవికి సంబంధించిన ఏ న్యూస్.. ఏ మ్యాగజైన్స్ లో కనిపించలేదట. అసలు విషయం ఏంటని చిరంజీవి అరా తీయగా.. మీడియా జర్నలిస్ట్‌లు అంతా తనని బ్యాన్ చేశారని తెలిసింది. దానికి కారణం ఏంటని కనుకోగా.. చిరంజీవికి అసలు విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలో మెకానిక్ అల్లుడు సినిమాకి సంబంధించి చిరంజీవి, ఏఎన్నార్ పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఆ సమయంలో ఎవరిని లోపాలకి పంపించవద్దని వాచ్ మెన్ కి దర్శకనిర్మాతలు గట్టిగా చెప్పారట.
ఇక అదే టైములో ఒక సీనియర్ జర్నలిస్ట్ చిరంజీవిని కలవడానికి అక్కడికి వచ్చాడు. అయితే వాచ్ మెన్ తనని లోపాలకి పంపించలేదు. ఆ జర్నలిస్ట్ తను వచ్చినట్టు చెప్పు వాళ్లే పిలుస్తారు అని చెప్పినా.. వాచ్ మెన్ వినకుండా ఆ జర్నలిస్ట్ వెనక్కి పంపించేశాడు. దీంతో అతను కోపం తెచ్చుకొని.. ఇతర జర్నలిస్టులతో మాట్లాడి చిరంజీవిని బ్యాన్ చేయించాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఆ జర్నలిస్ట్ ని కలిసి మాట్లాడాడు.
'ఎవరో ఒక వాచ్ మెన్ తెలియక చేసిన పనికి నువ్వు ఇంత నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఇతర జర్నలిస్టులతో కూడా చేయించావు. నాతో మాట్లాడి ఉంటే సరిపోతుందిగా' అని అడిగాడట. దానికి ఆ జర్నలిస్ట్ చిరంజీవికి సారీ చెప్పాడట. కానీ చిరంజీవి మాత్రం ఆ క్షమాపణ తీసుకోకుండా.. నువ్వు నీ నిర్ణయం పైనే ఉండమని చెప్పాడట.


Tags:    

Similar News