కథ, కంటెంట్ ఉంటే హిట్స్ వస్తాయ్..డైరెక్టర్లకు "చిరు" క్లాస్
ఇటీవల మంచి కంటెంట్ తో వచ్చిన 'బింబిసార', 'సీతారామం', 'కార్తికేయ 2' సినిమాలు మంచి హిట్ సాధించాయన్నారు. కంటెంట్ బాగుంటే..
ఇటీవల కాలంలో వస్తున్న తెలుగు సినిమాలు వరుసగా డిజాస్టర్ అవుతున్నాయి. సినిమా కథ, సాగతీత, సరైన కంటెంట్ లేకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో పెద్దహీరోల సినిమాలు సైతం వరుస ఫ్లాప్ లను చూశాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి "ఫస్ట్ డే ఫస్ట్ షో" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి సినిమాల ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతూ.. సినిమాలో కంటెంట్ ఉంటేనే జనాలు థియేటర్లకు వస్తారు. ఇది ఎవరూ ఆలోచించట్లేదు. థియేటర్స్ కి ఆదరణ తగ్గడంపై ఏవోవే కారణాలు చెప్తున్నారన్నారు.
ఈ మధ్యకాలంలో మంచి కంటెంట్ తో వచ్చిన 'బింబిసార', 'సీతారామం', 'కార్తికేయ 2' సినిమాలు మంచి హిట్ సాధించాయన్నారు. కంటెంట్ బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు సినిమాకి వస్తారని, లేకపోతే రెండో రోజే సినిమా పోతుందన్నారు. ఆ విషయంలో నేనూ బాధితుణ్నే. నాకు కూడా ఫ్లాప్స్ వచ్చాయని.. ఆచార్య సినిమాను దృష్టిలో ఉంచుకుని మాట్లాడారు. ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కథల మీద దృష్టి పెట్టాలి. ఒక సినిమా ఎందుకు హిట్ అయింది, ఎందుకు ఫ్లాప్ అయింది అని ఆలోచించాలి. డైరెక్టర్లే సినిమాకి కెప్టెన్స్. ఒక సినిమా స్క్రిప్ట్ రాసేటపుడు ప్రేక్షకుడిలా ఆలోచిస్తే.. ఇంత డబ్బు పెట్టి సినిమా ఎందుకు చూడాలో అర్థమవుతుందని చిరంజీవి తెలిపారు. డైరెక్టర్లు కథ, కంటెంట్ పై దృష్టిసారిస్తే హిట్స్ అవే వస్తాయన్నారు.
జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ అందించిన కథతో కొత్త దర్శకుడు వంశీ, లక్ష్మి నారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో. కొత్త నటీనటులతో తెరకెక్కుతున్న ఈ సినిమాని గతంలో ఎన్నో క్లాసిక్ సినిమాలు నిర్మించిన పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మించిన ఈ సినిమా.. నేడు విడుదలైంది.