‘సైరా’ను మళ్లీ వాయిదా వేశారా..?

బాహుబలి రెండు భాగాలు రిలీజ్ అవ్వడానికి అయిదు సంవత్సరాలు పట్టింది. అయితే చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సైరా రిలీజ్ అవ్వడానికి ఇంచుమించు అంతే పడుతుంది. బాహుబలికి రాజమౌళి [more]

Update: 2019-02-04 05:07 GMT

బాహుబలి రెండు భాగాలు రిలీజ్ అవ్వడానికి అయిదు సంవత్సరాలు పట్టింది. అయితే చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సైరా రిలీజ్ అవ్వడానికి ఇంచుమించు అంతే పడుతుంది. బాహుబలికి రాజమౌళి కాబట్టి ఎక్కడా రాజీ పడడు కాబట్టి అంత టైం పట్టినా సినిమా హిట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ సురేందర్ రెడ్డి మీద అంత హోప్స్ లేవు. అయితే సురేందర్ రెడ్డితో నిర్మాత రామ్ చరణ్ కూడా సినిమా అవుట్ పుట్ విషయంలో ఎక్కడ రాజీ పడడం లేదని టాక్. అందుకే షూటింగ్ పదేపదే వాయిదా పడుతూ వస్తోంది.

ఇంకా ఆలస్యం అవుతుందా..?

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ సైరా సినిమా 2019 దసరా కానుకగా రిలీజ్ అవుతుందని చెప్పాడు. అయితే తాజా సమాచారం ప్రకారం షూటింగ్ ఆలస్యం అవుతుందని.. సినిమా వాయిదా పడే అవకాశం ఉందని టాక్. 2017 సంక్రాంతి సీజన్ లో వచ్చిన ఖైదీ నెం.150 చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే బాహుబలి సినిమాకు అయిదేళ్లు పడితే సైరాకు మూడేళ్లు పట్టేలా ఉంది. ఈ సినిమా 2020లో వస్తుందని వార్తలు రావడంతో మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. మరి ఈ వార్తలకి తేర దించాలంటే నిర్మాత రామ్ చరణ్ వచ్చి నోరు విప్పాలి.

Tags:    

Similar News