ప్రభాస్ ని ఫాలో అవుతున్న చిరు
సాహో చిత్రం హిందీ లో తన మార్కెట్ ని స్ట్రాంగ్ చేసుకుందామన్న ఆలోచలనో ఉన్నాడు ప్రభాస్. అందుకే ఈసినిమాలో శ్రద్ద కపూర్ మరి కొంతమంది బాలీవుడ్ నటులని [more]
సాహో చిత్రం హిందీ లో తన మార్కెట్ ని స్ట్రాంగ్ చేసుకుందామన్న ఆలోచలనో ఉన్నాడు ప్రభాస్. అందుకే ఈసినిమాలో శ్రద్ద కపూర్ మరి కొంతమంది బాలీవుడ్ నటులని [more]
సాహో చిత్రం హిందీ లో తన మార్కెట్ ని స్ట్రాంగ్ చేసుకుందామన్న ఆలోచలనో ఉన్నాడు ప్రభాస్. అందుకే ఈసినిమాలో శ్రద్ద కపూర్ మరి కొంతమంది బాలీవుడ్ నటులని పెట్టారు. పైగా ఈచిత్రానికి బాలీవుడ్ లో మాములు క్రేజ్ లేదు. రీసెంట్ గా రిలీజ్ అయినా ట్రైలర్ తో మరింత అంచనాలు ఏర్పడ్డాయి.
అమితాబ్ ఉండటంతో…..
అయితే సాహో చిత్రానికి బాలీవుడ్‌లో ఏర్పడిన క్రేజ్ చూసి ‘సైరా’ లాంటి చిత్రాలకి కూడా అలాంటి ఆకర్షణ తీసుకు రావాలనే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సైరా చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో హిందీ లో క్రేజ్ తీసుకుని రావాలి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్ ఉన్నప్పటికీ మరింత క్రేజ్ తీసుకుని వస్తే అక్కడ కలెక్షన్స్ బాగుండి మంచి వసూళ్లు వచ్చే అవకాశముందని ఆలోచిస్తున్నారు. అందుకే ప్రమోషన్స్ కూడా అదే విధంగా చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.
కంటెంట్ ఉంటేనే…..
నిజానికి చిరంజీవి అక్కడ వారికి పరిచయస్తుడే అయినప్పటికీ బాహుబలితో ఈ జనరేషన్‌కి ప్రభాస్ దగ్గరయినంతగా మెగాస్టార్ అక్కడి వారికి రిజిష్టర్ అవలేదు. ప్రమోషన్స్ డిఫరెంట్ గా చేసి ట్రైలర్ కట్ ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమాలో కంటెంట్ ఉంటే తప్ప చిరంజీవి కి అక్కడ బజ్ ఏర్పడదు.