బిగ్ బాస్ ఫైనల్ కి గెస్ట్ ఎవరంటే!
బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు దశకు చేరుకుంది. మొదటి రెండు సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ కి ప్రేక్షకాదరణ తగ్గినమాట నిజమే. కానీ సీజన్ [more]
బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు దశకు చేరుకుంది. మొదటి రెండు సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ కి ప్రేక్షకాదరణ తగ్గినమాట నిజమే. కానీ సీజన్ [more]
బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు దశకు చేరుకుంది. మొదటి రెండు సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ కి ప్రేక్షకాదరణ తగ్గినమాట నిజమే. కానీ సీజన్ 3 ఫైనల్ ని గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తున్నారు నిర్వాహకులు. అందుకోసం గెస్ట్ ని ఇన్వైట్ చేయనున్నారు. సీజన్ 3 కోసం మెగా స్టార్ చిరంజీవి ని ఇన్వైట్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. నాగ్ ఆల్రెడీ చిరు ని ఫైనల్ ఎపిసోడ్ కు హాజరుకావాలని కోరారట. చిరు కూడా ఓకే అన్నట్టు తెలుస్తుంది.
ఆ అదృష్టం ఎవరికీ…?
నాగ్ – చిరు ఇద్దరూ బాగా క్లోజ్ గా ఉంటారు కాబ్బట్టి చిరు ఫైనల్ కి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మంచి టీఆర్పీలు సాధించేలా ప్లాన్ చేస్తున్నారు. సీజన్ 3 టైటిల్ విన్నర్ ఎవరో చిరు స్టేజి మీద ప్రకటిస్తారు. గత సీజన్ లో నాని హోస్ట్ గా ఉంటే ఫైనల్ కి గెస్ట్ గా వెంకటేష్ వచ్చి కౌశల్ మందా పేరును విజేతగా ప్రకటించారు. మరి ఈ సారి ఎవరు విన్ అవుతారో చూడాలి. చిరు చేతుల మీదుగా టైటిల్ ట్రోఫీ తీసుకునే అదృష్టం ఎవరికి ఉందో.