ఆచార్యకి షాకిచ్చిన కరోనా?

సినిమా ఇండస్ట్రీ మొత్తం షూటింగ్స్ తో కళకళలాడుతుంది. ఇక కరోనా కారణంగానే కొరటాల – చిరు కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. తాజాగా [more]

Update: 2020-11-09 07:47 GMT

సినిమా ఇండస్ట్రీ మొత్తం షూటింగ్స్ తో కళకళలాడుతుంది. ఇక కరోనా కారణంగానే కొరటాల – చిరు కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. తాజాగా నవంబర్ 9 నుండి ఆచార్య రీ షూటింగ్ ప్రారంభించబోతున్నట్టుగా ఆచార్య టీం ప్రకటించింది. చిరు తో పాటుగా ఆచార్య సినిమాలో కీలక నటీనటులతో 45 రోజుల భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నాడు కొరటాల. కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి, హాని మూన్ ముగించుకుని ఆచార్య సెట్స్ లో అడుగుపెడుతుంది అన్నారు. మరి కొరటాల శివ ఏకధాటిగా లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసి నేడు రంగంలోకి దిగే టైం లో ఆచార్య టీం మొత్తం కరోనా టెస్ట్ లు చేయించుకోగా.. అందులో చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడంతో.. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయినట్లుగా చిరు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసారు.

తాజాగా చిరంజీవి ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే  హోమ్  క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను… అంటూ చిరు ట్వీట్ చెయ్యడం తో మెగా అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే చిరు కి ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేకపోయినా కరోనా సోకిన కారణంగా ఆయన హోమ్ క్వారంటైన్ లో విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. చిరు తొందరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు, ఇండస్ట్రీలో ఆయన్ని అభిమానించే హీరోలు.. సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News