బుగ్గ గిల్లి జోల పాడడం అంటే ఇదేనా చిరూ?

చిరంజీవి ప్లాప్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తా అని చెప్పాడో.. లేదో.. ప్లాప్, డిజాస్టర్స్ డైరెక్టర్స్ మొత్తం పొలమంటా కథలు =పట్టుకుని మెగా కాంపౌండ్ కి దూరేసారు. [more]

Update: 2020-11-16 06:00 GMT

చిరంజీవి ప్లాప్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తా అని చెప్పాడో.. లేదో.. ప్లాప్, డిజాస్టర్స్ డైరెక్టర్స్ మొత్తం పొలమంటా కథలు =పట్టుకుని మెగా కాంపౌండ్ కి దూరేసారు. అందులో మెహెర్ రమేష్ వేదాళం, బాబీ తో చిరూ సినిమా, లూసిఫెర్ రీమేక్ కి వినాయక్ ఎంపికయ్యారనే న్యూస్ నడుస్తుంది. ఆచర్య తర్వాత ముందు మెహెర్ రమేష్ తో వేదాళం రీమేక్ చెయ్యబోతున్న చిరూ కి లూసిఫెర్ విషయంలో డైరెక్టర్ లెక్క తేలడం లేదు. ముందు సుజిత్ ని లూసిఫెర్ రీమేక్ దర్శకుడిగా అనుకున్నప్పటికీ.. అతను తెలుగు స్క్రిప్ట్ తో మెప్పించలేకపోవడంతో చిరు సుజిత్ ప్లేస్ లోకి ప్లాప్ డైరెక్టర్ వినాయక్ ని తీసుకొచ్చాడు.

అయితే ఫస్ట్ హాఫ్ తో అన్నయ్య చిరుని మెప్పించిన వినాయక్.. సెకండ్ హాఫ్ విషయంలో చిరు ని మెప్పించలేకపోతున్నాడట. లూసిఫెర్ సెకండ్ హాఫ్ చిరూ కి నచ్చడం లేదట. వినాయక్ ఎంతగా లూసిఫెర్ రీమేక్ సెకండ్ హాఫ్ లో మార్పులు చేర్పులు చేసినా.. ఆ మార్పులు చిరుని శాటిస్ఫాయ్ చెయ్యలేకపోతున్నాయట. దానితో చిరూ లూసిఫెర్ రీమేక్ ని ఆపెయ్యడమా? వినాయక్ ని తప్పించడమా? అనే ప్రశ్నకి చిరూ వినాయక్ ని తప్పించి.. తర్వాత మరో సినిమా చేద్దామని చిరూ వినాయక్ కి మాటిచ్చాడట. 
అయితే ఇప్పుడు లూసిఫెర్ రీమేక్ ని హరీష్ శంకర్ తో చెయ్యగానే ప్లాన్ లో చిరూ ఉన్నాడని.. హరీష్ ని పిలిచి లూసిఫెర్ ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చమని చిరూ హరీష్ ని అడిగినట్లుగా ఫిలిం నగర్ టాక్. 

Tags:    

Similar News