చిరు అందుకే ప్రకటించలేదా?

చిరంజీవి పుట్టిన రోజునాడు ఆచార్య ఫస్ట్ లుక్ తో పాటుగా.. మరో కొత్త సినిమా ఎనౌన్సమెంట్ చేయబోతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో నడిచింది. మెహెర్ రమేష్ తో [more]

Update: 2020-08-31 03:14 GMT

చిరంజీవి పుట్టిన రోజునాడు ఆచార్య ఫస్ట్ లుక్ తో పాటుగా.. మరో కొత్త సినిమా ఎనౌన్సమెంట్ చేయబోతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో నడిచింది. మెహెర్ రమేష్ తో వేదాళం రీమేక్ కానీ, లేదంటే దర్శకుడు బాబీ తో కొత్త సినిమా కానీ చిరు తన పుట్టిన రోజునాడు ప్రకటిస్తాడనుకున్నారు. కానీ పుట్టినరోజు వచ్చింది వెళ్ళింది.. ఎలాంటి ప్రకటన లేదు.. అయితే తాజాగా చిరు కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించడానికి అటు బాబీ కథకి కానీ, మెహెర్ రమేష్ వేదాళం రీమేక్ కథకి ఇంకా కమిట్ కాలేదని.. తాజాగా లిస్ట్ లోకి త్రివిక్రమ్, వినాయక్ లు రావడంతో చిరు తన కొత్త సినిమా ప్రకటన ఆపినట్లుగా వార్తలొస్తున్నాయి.

గతంలో చిరు – త్రివిక్రమ్ కాంబోపై వార్తలొచ్చిన.. తాజాగా చిరుకి త్రివిక్రమ్ చెప్పిన కథ బాగా నచ్చబట్టే కొత్త ప్రాజెక్ట్ విషయంలో చిరు తొందర పడడం లేదని అంటున్నారు. ఎన్టీఆర్ తో చెయ్యాల్సిన సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావడంతో త్రివిక్రమ్.. చిరు కథని ప్రిపేర్ చేస్తున్నాడట. చిరు – త్రివిక్రమ్ కాంబో పక్కా కమర్షియల్ గా ఈ సినిమా సాగనుందని.. అలాగే ఈ సినిమాలో దొంగ స్వామిజీల మీద ఒక మెసేజ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. మరి చిరు తో త్రివిక్రమ్ సినిమా అనగానే మెగా ఫాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చిరు తో మూవీని కొరటాల ఆచార్య తర్వాత ప్రకటిస్తాడేమో చూడాలి.

Tags:    

Similar News