చిరు ఏమిటి డిజాస్టర్ డైరెక్టర్స్ కి కమిట్ అవుతున్నాడు!!
చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ తర్వాత పాన్ ఇండియా మూవీ సై రా సినిమాతో బాగా దెబ్బతిన్నాడు. తర్వాత కొరటాల శివ తో సేఫ్ గా [more]
చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ తర్వాత పాన్ ఇండియా మూవీ సై రా సినిమాతో బాగా దెబ్బతిన్నాడు. తర్వాత కొరటాల శివ తో సేఫ్ గా [more]
చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ తర్వాత పాన్ ఇండియా మూవీ సై రా సినిమాతో బాగా దెబ్బతిన్నాడు. తర్వాత కొరటాల శివ తో సేఫ్ గా ఆచార్యా సినిమా చేస్తున్నాడు. కొరటాలతో సేఫ్ గేమ్ ఆడుతున్న చిరంజీవి.. తర్వాత లూసిఫెర్ రీమేక్ ని డిజాస్టర్ సాహో డైరెక్టర్ సుజిత్ తో చేస్తున్నాడు. ఈ విషయంలో మెగా ఫాన్స్ కాస్త అందోళనగానే ఉన్నారు. సాహో తో దెబ్బతిన్న సుజిత్ తో మెగాస్టర్ మూవీ ఎలా ఓకె చేసాడని. అంతేకాకుండా ఇప్పుడు చిరు కమిట్ అయినా డైరెక్టర్స్ లిస్ట్ చూస్తుంటే…. మెగా ఫాన్స్ కి చమట్లు పట్టడం ఖాయమే.
చిరు ప్రస్తుతం లూసిఫెర్ రీమేక్ తర్వాత యంగ్ డైరెక్టర్స్ అందులోను డిజాస్టర్ డైరెక్టర్స్ తో సినిమాలు చెయ్యాలని అనుకున్నట్లుగా ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్న న్యూస్ తో చిరు ఇటీవల స్పందించాడు. తనకి సుజిత్ లూసిఫెర్ రీమేక్ తర్వాత వెంకిమామ దర్శకుడు బాబీ, శక్తి డిజాస్టర్ మెహెర్ రమేష్ లతో సినిమాలు ఉంటాయని… అంతేకాకుండా హరీష్ శంకర్, సుకుమర్, పరశురామ్ లను కూడా ఈమధ్యనే తన ఇంట్లో కలిశా అని చెప్పిన చిరు వారితో కథా చర్చలు కూడా జరిగాయని చెబుతున్నాడు. యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తే తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవచ్చని… నన్ను వెండితెర మీద చూస్తూ పెరిగిన కురాళ్ళ దర్శకులుగా మరి సినిమాలు చేస్తే నన్ను యంగ్ జనరేషన్ కి దగ్గరగా కొత్తగా ప్రెజెంట్ చెయ్యాలనే తపన ఉంటుంది కాబట్టే.. ఈ యంగ్ డైరెక్టర్స్ అందరితో నా సినిమాలు వరసగా ఉండొచ్చు అంటున్నాడు చిరు.