చిత్రలహరి డే 1 కలెక్షన్స్

నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా విడుదలైన సాయి తేజ్ చిత్రలహరి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ప్రేక్షకులు నుండి మాత్రమే కాదు.. క్రిటిక్స్ కూడా చిత్రలహరి సినిమాకి [more]

;

Update: 2019-04-13 05:31 GMT
chitralahari movie result
  • whatsapp icon

నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా విడుదలైన సాయి తేజ్ చిత్రలహరి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ప్రేక్షకులు నుండి మాత్రమే కాదు.. క్రిటిక్స్ కూడా చిత్రలహరి సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చారు. కిషోర్ తిరుమల దర్హకత్వంలో మైత్రి మూవీస్ వారు నిర్మించిన ఈ చిత్రంలో సాయి తేజ్ సరసన హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శిని, నివేత పేతురేజ్ లు నటించారు. సునీల్, వెన్నెల కిషోర్ లు కమెడియన్స్ గా నటించిన చిత్రలహరి చిత్రం తో సాయి ధరమ్ తేజ్ తన ప్లాపుల పరంపరకు అడ్డుకట్ట వేసాడు. ఇప్పటివరకు డబుల్ హ్యాట్రిక్ ప్లాప్స్ తో ఉన్న సాయి తేజ్ ఈ చిత్రలహరితో యావరేజ్ హిట్ అందుకున్నట్టే కనబడుతుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ సెలవలు స్టార్ట్ కావడం కూడా చిత్రలహరి కి కలిసొచ్చింది. అందుకే చిత్రలహరి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల లో 3 కోట్ల కలెక్షన్స్ పర్వాలేదనిపించింది.

ఏరియా: డే 1 కలెక్షన్స్ (కోట్లలో)
నైజాం 0.79
సీడెడ్ 0.51
అర్బన్ ఏరియాస్0.42
ఈస్ట్ గోదావరి 0.38
కృష్ణ 0.24
గుంటూరు 0.30
వెస్ట్ గోదావరి 0.24
నెల్లూరు 0.14

ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 3.02

Tags:    

Similar News