అయ్యో కల్యాణికి మళ్ళీ దెబ్బపడింది

అఖిల్ సరసన హలో సినిమాలో సోలో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్.. ఆ సినిమాతో ప్లాప్ అందుకుంది. క్యూట్ లుక్స్ ఉన్నపటికీ…. [more]

;

Update: 2019-04-13 15:13 GMT
kalyani in bheeshma movie
  • whatsapp icon

అఖిల్ సరసన హలో సినిమాలో సోలో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్.. ఆ సినిమాతో ప్లాప్ అందుకుంది. క్యూట్ లుక్స్ ఉన్నపటికీ…. కళ్యాణి ట్రెడిషనల్ గా ఉంటుంది. ఆమె గ్లామర్ భామ కాదు. అందాలు ఆరబొయ్యడానికి ఆమె సిద్దమయిన.. కళ్యాణి గ్లామర్ లుక్స్ అంతగా బావుండవు. కళ్యాణి ట్రెడిషనల్ గర్ల్ గానే హిట్ అందుకోవాలి గాని….. గ్లామర్ పరంగా సక్సెస్ కాదన్నారు. హలో సినిమాలో అలాగే పద్ధతిగా కనబడిన కల్యాణికి ఆ సినిమా వలన వచ్చింది లేదు, పోయింది లేదు. తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి సాయి తేజ్ పక్కన చిత్రలహరి సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది.

లుక్స్ పరంగా ఓకె అన్నప్పటికీ…. కేరెక్టర్ పరంగా కల్యాణికి చెప్పుకోదగిన పాత్ర చిత్రలహరి లో పడలేదు. లహరి పాత్రలో ఉన్నంతలో పర్వాలేదనిపించినా.. దర్శకుడు కిషోర్ తిరుమల మాత్రం హీరోయిన్స్ ట్రాక్ ని ఎక్కడా ఎలివేట్ చెయ్యలేదు. మరో హీరోయిన్ నివేత పేతురేజ్ పాత్ర కూడా పెద్దగా ప్రాధాన్యత లేదు. సరైన హీరోయిన్లను టీమ్ లోకి తీసుకోవడంలో యూనిట్ విఫలమైంది. సినిమాకు అది పెద్ద వీక్ పాయింట్. కళ్యాణి, నివేతలు లుక్స్ లో ఫ్రెష్ గా కనిపించారు కానీ… కేరెక్టర్స్ లో కొత్తదనం లేదు.మరి ఈ సినిమాతోనూ కళ్యాణి హీరోయిన్ గా పెద్దగా ఫోకస్ అయ్యేలా కనిపించడం లేదు.

Tags:    

Similar News