‘చిత్రలహరి’ హిట్టా..? ఫట్టా..?

సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శని, నివేత పేతురేజ్ జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రలహరి గత శుక్రవారం విడుదలై యావరేజ్ టాక్ తో ఫస్ట్ [more]

;

Update: 2019-04-15 10:31 GMT
chitralahari movie result
  • whatsapp icon

సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శని, నివేత పేతురేజ్ జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రలహరి గత శుక్రవారం విడుదలై యావరేజ్ టాక్ తో ఫస్ట్ వీకెండ్ లో సూపర్ హిట్ కలెక్షన్స్ తో అదరగొడుతుంది. ఆరు ఫ్లాప్స్ తర్వాత ఆశాకిరణంగా సాయి ధరమ్ కి చిత్రలహరి హిట్ తగిలింది. ఇక ఈ సినిమా హిట్ కోసం సాయి ధరమ్ తన పేరు సాయి తేజ్ గా మార్చుకున్నాడు. పేరు మార్చుకున్న తర్వాత సాయి తేజ్ కి చిత్రలహరితో హిట్ అందుకున్నట్లే కనబడుతుంది. ఇకపొతే వరల్డ్ వైడ్ గా 12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న చిత్రలహరి ఫస్ట్ వీకెండ్ లో దాదాపుగా 9 కోట్లు కొల్లగొట్టింది. ఈ లెక్కన సాయి తేజ్ కి చిత్రలహరితో హిట్ పడిందనే చెప్పాలి.

వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ చిత్రలహరి కలెక్షన్స్ మీకోసం….

ఏరియా కలెక్షన్స్

నైజాం 2.53
సీడెడ్ 1.28
అర్బన్ ఏరియాస్ 1.10
ఈస్ట్ గోదావరి 0.78
కృష్ణ 0.60
గుంటూరు 0.67
వెస్ట్ గోదావరి 0.50
నెల్లూరు 0.29
ఏపీ, టీఎస్ షేర్స్ 7.75
ఇతర ప్రాంతాలు 0.75
ఓవర్సీస్ 0.85
వరల్డ్ వైడ్ షేర్స్ 9.35 కోట్లు

Tags:    

Similar News