రియల్ లైఫ్ క్యారెక్టర్ తోనే రీల్ లైఫ్ లో..!

డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత సాయి ధరమ్ తేజ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో చిత్రలహరి సినిమా చేసాడు. ఈ సినిమా హిట్ [more]

;

Update: 2019-04-11 10:18 GMT
pawan kalyan response over chitralahari
  • whatsapp icon

డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత సాయి ధరమ్ తేజ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో చిత్రలహరి సినిమా చేసాడు. ఈ సినిమా హిట్ సాయి ధరమ్ కి అత్యంత అవసరం. మొదట్లో మెగా హీరోగా యావరేజ్ హిట్స్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ మూడేళ్లలో ఆరు ఫ్లాపులను మూటగట్టుకున్నాడు. ఆరు ఫ్లాపులంటే అతని నెక్స్ట్ సినిమాల మర్కెట్ ఎలా ఉంటుంది ? పూర్తిగా పడిపోతుంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ మెగా హీరోకి గుడ్డిలో మెల్లలా చిత్రలహరి సినిమా మీద మంచి హోప్స్ కనబడుతున్నాయి.

సక్సెస్ కోసం చూసే క్యారెక్టర్ లో

చిత్రలహరి సాంగ్స్ కి దేవిశ్రీ కాస్త ఇంట్రెస్టింగ్ ట్యూన్స్ ఇచ్చాడు. ఇక చిత్రలహరి ట్రైలర్ కూడా సినిమా మీద అంచనాలు పెంచేసింది. అయితే సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఉన్న ఫ్లాప్స్ పరిస్థితిని చిత్రలహరి సినిమాలో చూపెట్టారు. ఎప్పుడూ సక్సెస్ కోసం తపించే వ్యక్తిగా సాయి ధరమ్ క్యారెక్టర్ చిత్రలహరి సినిమాలో ఉంది. సక్సెస్ దరిచేరక నిత్యం నిరాశతో బ్రతికే యువకుడిగా.. ఎలా తన జీవితం బాగుపడుతుందా అని ఎదురుచూసే పాత్రలో సాయి ధరమ్ కనిపిస్తాడట. మరి ప్రస్తుతం హిట్ కోసం తపిస్తున్న సాయి ధరమ్ కి సినిమా క్లైమాక్స్ లో సక్సెస్ వచ్చినట్టుగా ఆరు ఫ్లాప్స్ తర్వాత హిట్ కొడతాడో లేదో మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. అయితే ఈ సినిమా విజయంపై సాయి ధరమ్ చిత్రలహరి ప్రమోషన్స్ లో ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

Tags:    

Similar News