వచ్చే వారం థియేటర్ల పరిస్థితి ఏంటో..?

గత వారం మజిలీ సినిమా హిట్ అయితే.. ప్రేమ కథ చిత్రం 2 ఫట్. మజిలీ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో ప్రేక్షకుడికి వినోదం పంచుతోంది. [more]

Update: 2019-04-10 09:49 GMT

గత వారం మజిలీ సినిమా హిట్ అయితే.. ప్రేమ కథ చిత్రం 2 ఫట్. మజిలీ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో ప్రేక్షకుడికి వినోదం పంచుతోంది. రిపీట్ ఆడియన్స్ లేకపోయినా.. మజిలీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల దిశగా పయనిస్తుంది. చైతు కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా మజిలీ నిలవబోతుంది. ఇక ఈ వారం పరిస్థితి ఇలా ఉంటే ఈ శుక్రవారం మెగా హీరో సాయి ధరమ్ – నియత పేతురేజ్ – కళ్యాణి ప్రియదర్శిని జంటగా నటించిన చిత్రలహరి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి డబుల్ డిజాస్టర్స్ తో సాయి ధరమ్ ప్రస్తుతం చిత్రలహరి మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి రేపటితో ముగియనుంది. మరి ఎన్నికల వేడి ముగిసినాక చాలామంది ఫ్రీ అవుతారు. చిత్రలహరికి టాక్ కాస్త లేచినా సినిమా హిట్ అవుతుంది.

చిత్రలహరికి పోటీ లేదు…

ప్రస్తుతం చిత్రలహరికి పోటీగా మరే తెలుగు చిత్రమూ లేదు. కానీ మలయాళం నుండి లూసిఫెర్ తెలుగులో డబ్ అవుతుంది. చిత్రలహరి చిత్రానికి అన్నీ పాజిటివ్ గానే కనబడుతున్నాయి. ఈ సినిమాలో ఫుల్ గా కామెడీ ఉందని ట్రైలర్ లోనే తెలుస్తోంది. సెన్సార్ వారు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారంటే సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా ఎక్కుతుందనే ఫీలింగ్ రావడం కూడా సినిమాకి పాజిటివ్ గా కనబడుతుంది. మరి సాయి ధరమ్ తేజ్ లక్ ఎలా ఉందో ఈ చిత్రలహరి తేల్చేయనుంది. దర్శకుడు కిషోర్ తిరుమల.. సాయి ధరమ్ ని ఏ తీరానికి చేర్చనున్నాడో మరొక్క రోజులో తేలిపోతుంది. ప్రస్తుతానికైతే థియేటర్స్ కళకళలాడుతున్నాయి. వచ్చే వారం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News