Vikram Comments : నా సినిమా కాదని బాహుబలిని తీసుకు వెళ్లారు..
నేషనల్ అవార్డు సమయంలో నా సినిమా కాదని బాహుబలిని తీసుకు వెళ్లారు అంటూ విక్రమ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో టాప్ లో ఉంది అనడంలో పెద్ద సందేహ పడనవసరం లేదు. బాహుబలి, RRR, పుష్ప సినిమాలతో తెలుగు సినిమా ఇంటర్నేషనల్ మార్కెట్ వరకు వెళ్తున్నాయి. హాలీవుడ్ ఆడియన్స్ మన తెలుగు సినిమాలు పై ఆసక్తి చూపడం మొదలు పెట్టారు. అయితే పక్కనే ఉన్న తమిళ ఇండస్ట్రీలో మాత్రం టాలీవుడ్ సినిమాలకు పెద్దగా ఆదరణ రావడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
జైలర్, విక్రమ్, లియో సినిమాలకు ఇక్కడ కలుగుతుంది ప్రేక్షాధారణ, థియేటర్స్ వెసులుబాటు.. తెలుగు సినిమాలకు తమిళ పరిశ్రమలో కలగడం లేదని సమాచారం. ఇక ఇదే విషయాన్ని తమిళ స్టార్ హీరో విక్రమ్ ని ప్రశ్నించారు. త్వరలో 'తంగలాన్' మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న విక్రమ్.. తాజాగా ఆ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. ఆ తరువాత విక్రమ్ మీడియాతో సమావేశమైన సమయంలో విక్రమ్ కి ఎదురైన ప్రశ్న.. "తమిళ ప్రేక్షకులు తెలుగు సినిమాలను ఆదరించడం లేదు ఎందుకు?".
దీనికి విక్రమ్ సమాధానం ఇస్తూ.. "అలా ఏం లేదు. మంచి సినిమా వస్తే ఏ భాష అయినా చూస్తారు. బాహుబలి సినిమా తమిళ సినిమాలకంటే ఎక్కువ కలెక్ట్ చేసి కొన్నాళ్ళు అక్కడ టాప్ లో ఉంది. నేషనల్ అవార్డు సమయంలో తమిళ పరిశ్రమ నుంచి నా 'ఐ' సినిమా పంపుదాం అనుకున్నా. ఆ సమయంలో నేషనల్ అవార్డు జ్యూరీలో తమిళ్ వ్యక్తి ఉన్నాడు. కానీ అతను నా 'ఐ' సినిమాకి బదులు తమిళ పరిశ్రమ నుంచి బాహుబలి తీసుకు వెళదాం అని చెప్పాడు. దానిని నేను ఆహ్వానించాను" అంటూ చెప్పుకొచ్చాడు.
తంగలాన్ చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. "తెలుగు, తమిళ్, కన్నడ సినిమాలు అని బేధం లేదండి ఇప్పుడు. ఇప్పుడు అంతా సౌత్ సినిమా అంతే. నార్త్ వాళ్ళకి కేజీఎఫ్, RRR సినిమాలు సౌత్ అని తెలుసు తప్ప ఏ భాషవి అనే తెలియదు. అవి వాళ్ళకి అవసరం లేదు కూడా. ఎందుకంటే వాళ్ళకి సినిమా నచ్చితే చాలు. తమిళ ఆడియన్స్ అయినా అంతే, తెలుగు ఆడియన్స్ నా అంతే. మంచి సినిమా వస్తే ప్రతి ఒక్కరు ఆదరిస్తారు" అంటూ చెప్పుకొచ్చాడు.