విషాదం.. కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. ఆయన వయస్సు 53 సంవత్సరాలు.
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. ఆయన వయస్సు 53 సంవత్సరాలు. వారంరోజుల క్రితం వైజాగ్ లో షూటింగ్ ను ముగించుకుని హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. ఆదివారం ఉదయం రక్తపు విరేచనాలు కావడంతో ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్‌ను కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు గుండెపోటుతో రాకేష్ మాస్టర్ మరణించారు.
''రాకేష్ మాస్టర్ డయాబెటిక్ పేషంట్, ఆయనకు సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యింది. షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయి. సాయంత్రం ఐదు గంటలకు రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది చివరి నిమిషంలో గాంధీ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు'' అని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.
టెలివిజన్‌లో ప్రసారమైన 'ఆట', ఢీ డ్యాన్స్ షో లతో కెరీన్‌ను మొదలు పెట్టిన రాకేష్ మాస్టర్.. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫ్ చేశారు. దాదాపు 1500 సినిమాలకు పనిచేశారు. అయితే చాలా కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ వస్తున్నారు. నెట్టింట మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తన శిష్యులు తన జీవితాన్ని నాశనం చేశారంటూ ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసి ఫేమస్ అయ్యారు. కామెడీ షో జబర్దస్త్ లోనూ పలు స్కిట్లలో కనిపించి.. తన కామెడీతో నవ్వించారు. రాకేష్ మాస్టర్ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ కూడా నడిపేవారు. 1968లో తిరుపతిలో జన్మించారు రాకేష్ మాస్టార్.. అసలు పేరు ఎస్.రామారావు. హైదరాబాద్ లో ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం పనిచేశారు. ఆయన మరణ వార్త సినీ ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. రాకేష్ మాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.