చిరు సరసన గోవా బ్యూటీ

సైరా తరువాత మెగా స్టార్ చిరంజీవి కొరటాల డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరు డ్యూయల్ పాత్ర పోషించనున్నారు. అందుకుగాను [more]

Update: 2019-09-05 06:50 GMT

సైరా తరువాత మెగా స్టార్ చిరంజీవి కొరటాల డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరు డ్యూయల్ పాత్ర పోషించనున్నారు. అందుకుగాను చిరు కోసం కొరటాల టీం ఇద్దరు హీరోయిన్స్ ని వెతికే పనిలో పడింది. నయనతార చిరుతో నటించే అవకాశముందని తెలుస్తోంది. సైరా తరువాత మరోసారి నయనతార చిరుతో చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతుందట. అలానే మరో హీరోయిన్ గా అలనాటి సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటించే అవకాశం ఉందని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

ఇలియానా కు ఛాన్స్…..

ఇప్పుడు తాజాగా చిరు సరసన గోవా బ్యూటీ ఇలియానాకు ఛాన్స్ వచ్చిందని చెబుతున్నారు. రీసెంట్ గా ఈ బ్యూటీ తన ప్రియుడుతో విడిపోయి సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న టైములో టాలీవుడ్ నుంచి ఛాన్స్ వచ్చింది. చిరు పక్కన పేరొందిన హీరోయిన్స్ నే తీసుకోవాలని డిసైడ్ అయి ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ నే తీసుకుంటున్నారు కొరటాల టీం. అయితే వీటిపై అధికార ప్రకటన రావాల్సిఉంది. నవంబర్ లో ఈమూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.

Tags:    

Similar News