నా బోల్డ్ యాక్టింగ్ మా అమ్మకి చెప్పే చేస్తా
RX 100 సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్ లో సిగార్ కాలుస్తూ మందుకొట్టే సీన్స్ లో బోల్డ్ గా నటించిన పాయల్ రాజపుట్ ని అందరూ బోల్డ్ దృష్టితోనే [more]
RX 100 సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్ లో సిగార్ కాలుస్తూ మందుకొట్టే సీన్స్ లో బోల్డ్ గా నటించిన పాయల్ రాజపుట్ ని అందరూ బోల్డ్ దృష్టితోనే [more]
RX 100 సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్ లో సిగార్ కాలుస్తూ మందుకొట్టే సీన్స్ లో బోల్డ్ గా నటించిన పాయల్ రాజపుట్ ని అందరూ బోల్డ్ దృష్టితోనే చూశారు. పాయల్ కి తర్వాత అవకాశాలు రావడానికి చాలా టైం పట్టింది. అయితే బోల్డ్ కేరెక్టర్స్ వస్తున్నాయని ఒప్పుకొని పాయల్ మళ్లీ RDX లవ్ సినిమాకి ఒకే చేసింది. ఆ సినిమా కూడా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలానే ఉంది. ఇలాంటి బోల్డ్ కేరెక్టర్స్ చేస్తున్నప్పుడు చాలామంది హీరోయిన్ తమ తల్లితండ్రులకు చెప్పి చేస్తారో ? చెప్పకుండా చేస్తారో? అనే డౌట్ చాలా మందిలో ఉంది.
అమ్మతో ముద్దులు పంచుకుంటా…..
పాయల్ రాజపుట్ మాత్రం తాను చేసే కేరెక్టర్స్ కి సంబంధించిన అన్ని విషయాలను వాళ్ళమ్మతో చర్చించే నిర్ణయం తీసుకుంటుందట. అసలు మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఇప్పటికి నేను ఏ స్క్రిప్ట్ విన్నా అందులోని విషయాలను మా అమ్మతో పంచుకుంటా అంటుంది పాయల్. ఈ సినిమాలో రొమాంటిక్ అండ్ ముద్దు సీన్స్ ఉంటాయని మా అమ్మకి చెబుతా అంటుంది. మా అమ్మ కూడా నాకు సౌకర్యంగా అనిపిస్తే చెయ్యి అంటుంది. ఇక సినిమాలో ఆ ముద్దు సీన్స్ గట్రా చూసాక వాళ్ళు మౌనంగా ఉంటారు కానీ ఎప్పుడూ దాని గురించి బయటికి మాత్రం చెప్పరంటుంది RDX భామ పాయల్.