ఈ ఫొటోలో ఉన్నది ఆ కమెడియనేనా ?
తాజాగా మరో నటుడి ఫోటో కూడా నెట్టింట అలాగే వైరల్ అవుతోంది. పైగా ఆయన ఆరోగ్యం బాలేదని కొందరు, చనిపోయారని..
90ల్లో ఇండస్ట్రీలో ఉన్న నటీనటుల్లో కొందరు గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. ఆ మధ్య పరుచూరి గోపాలకృష్ణ మారిపోయారంటూ ఆయన ఫోటో బాగా వైరల్ అయింది. తాజాగా మరో నటుడి ఫోటో కూడా నెట్టింట అలాగే వైరల్ అవుతోంది. పైగా ఆయన ఆరోగ్యం బాలేదని కొందరు, చనిపోయారని ఇంకొందరు పోస్టులు చేయడంతో స్వయంగా ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆయనెవరో కాదు.. ఒకప్పటి స్టార్ కమెడియన్ సుధాకర్. కొన్నేళ్లుగా ఆయన నటనకు, సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు.
కొన్ని నెలల క్రితం సుధాకర్ తీవ్ర అనారోగ్యానికి గురై.. తిరిగి కోలుకున్నట్లు తెలిసింది. తాజాగా ఆయన ఆరోగ్యంపై కొన్ని వార్తలు రావడంతో.. వాటిని సుధాకర్ ఖండించారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. "అందరికీ నమస్కారం. నా ఆరోగ్యంపై వచ్చిన వార్తలు ఫేక్ న్యూస్. తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. వాటిని స్ప్రెడ్ చేయకండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని ఆ వీడియోలో పేర్కొన్నారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇందులో ఉన్నది కమెడియన్ సుధాకరేనా అన్న సందేహం కలుగకుండా ఉండదు. ఆయనేంటి ఇలా అయిపోయారని నెటిజన్లు షాకవుతున్నారు.