ఈసారి స్నేహితుడు ఆదుకోవడం ఖాయం
హీరోగా ఎన్ని వేషాలేసినా…. చివరికి తనని మళ్ళీ కామెడియన్ గా నిలబెట్టేది తన స్నేహితుడు దర్శకుడు త్రివిక్రమ్ అని సునీల్ ఎప్పుడూ చెబుతూనే ఉన్నాడు. అలాగే హీరోగా [more]
హీరోగా ఎన్ని వేషాలేసినా…. చివరికి తనని మళ్ళీ కామెడియన్ గా నిలబెట్టేది తన స్నేహితుడు దర్శకుడు త్రివిక్రమ్ అని సునీల్ ఎప్పుడూ చెబుతూనే ఉన్నాడు. అలాగే హీరోగా [more]
హీరోగా ఎన్ని వేషాలేసినా…. చివరికి తనని మళ్ళీ కామెడియన్ గా నిలబెట్టేది తన స్నేహితుడు దర్శకుడు త్రివిక్రమ్ అని సునీల్ ఎప్పుడూ చెబుతూనే ఉన్నాడు. అలాగే హీరోగా అవకాశాలు సన్నగిల్లాక త్రివిక్రమ్, సునీల్ కి తన అరవింద సమేతలో మంచి కేరెక్టర్ ఇచ్చాడు. కానీ కామెడీకి తక్కువ….. కేరెక్టర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ అన్నట్టుగా అరవింద సమేత లో నీలాంబరిగా సునీల్ మిగిలిపోయాడు. పాత్ర నిడివి బావున్నా కామెడీకి స్కోప్ లేకపోవడంతో సునీల్ ఉసూరుమన్నాడు. ఇక అమర్ అక్బర్ ఆంటోని, పడి పడి లేచే మనసు సినిమాల్లో సునీల్ మరీ కామెడీ పాత్రల్లో ఆకట్టుకోకపోగా…. ఇర్రిటేటింగ్ గా అనిపించాడు.
మరి కమెడియన్ గా బొద్దుగా మారానని చెప్పిన సునీల్ కి ఇప్పుడు అధిక బరువు సమస్యలా కనబడుతుంది. ఇకపోతే అరవింద సమేతలో సునీల్ కేరెక్టర్ ని కథానుసారంగా సీరియస్ గా రాసిన త్రివిక్రమ్ ఈసారి తన కొత్త ప్రాజెక్ట్ లో పూర్తిస్థాయి కామెడీ పంచ్ లకే సునీల్ కేరెక్టర్ ని డిజైన్ చేస్తున్నాడట. త్రివిక్రమ్.. అల్లు అర్జున్ తో చెయ్యబోయే సినిమాలో సునీల్ కి కమెడియన్ గా మంచి పాత్ర రెడీ చేసాడనే టాక్ వినబడుతుంది. త్రివిక్రమ్ రాసిన కామెడీ పంచ్ డైలాగ్స్ సునీల్ నోటా పలికించి మళ్ళీ సునీల్ ని కమెడియన్ గా బిజీ చేసే ఉద్దేశ్యంతో ఉన్నాడంటున్నారు.
మరి గతంలో త్రివిక్రమ్ డైలాగ్స్ తో తెరకెక్కిన సినిమా ల్లో సునీల్ కామెడీ ఎంతగా పండిందో.. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలోనూ సునీల్ అలాంటి కామెడీ కేరెక్టర్ నే త్రివిక్రమ్ తన స్నేహితుడు కోసం రాసాడట. మరి ఈ సినిమాతో అన్నా సునీల్ మళ్ళీ పుంజుకుంటాడో లేదో చూద్దాం.