సునీల్ హాస్పిటల్ లోనా?

హీరో అవకాశాలు తగ్గాక మల్లి కమెడియన్ గా మారిన సునీల్ కి తాను ఆశించిన పాత్రలైతే రావడం లేదు కానీ… సినిమాల మీద సినిమాలు మాత్రం వస్తున్నాయి. [more]

Update: 2020-01-23 07:50 GMT

హీరో అవకాశాలు తగ్గాక మల్లి కమెడియన్ గా మారిన సునీల్ కి తాను ఆశించిన పాత్రలైతే రావడం లేదు కానీ… సినిమాల మీద సినిమాలు మాత్రం వస్తున్నాయి. తాజాగా అల వైకుంఠపురములో సినిమాలో నటించిన సునీల్.. రేపు విడుదలకాబోయే డిస్కో రాజా లోను నటించాడు. అయితే తాజాగా సునీల్ అస్వస్థతకి గురైనట్లుగా సమాచారం. గచ్చిబౌలిలోని ఏ.ఐ.జీ ప్రైవేటు ఆసుపత్రి లో సునీల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని…. ప్రస్తుతం సునీల్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నట్లుగా ఆయన కుటుంభం సభ్యులు చెబుతున్న మాట.

అయితే సునీల్ గొంతు, లివర్ సమస్యతో బాధపడుతున్నట్టు సమాచారం. కానీ హాస్పిటల్ వర్గాలు మాత్రం సునీల్ ఆరోగ్య విషయాలేమి బయటికి చెప్పలేదు. అయితే సునీల్ అభిమానులు మాత్రం సునీల్ ఆరోగ్యం ఎలా ఉందొ అంటూ ఆందోళన చెందుతున్నారు. మరి సునీల్ జనరల్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్లాడా? లేదా మారేదన్నానా అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News