కరోనాతో వణుకుతున్న కమెడియన్స్!!

ఇప్పుడు ఒక్క సినిమా ఇండస్ట్రీనే కాదు.. ప్రపంచం మొత్తం పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య కరోనా. కరోనా తగ్గుతుంది.. షూటింగ్స్ మొదలెడమని అందరూ యదావిధిగా లాక్ [more]

Update: 2020-07-12 08:36 GMT

ఇప్పుడు ఒక్క సినిమా ఇండస్ట్రీనే కాదు.. ప్రపంచం మొత్తం పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య కరోనా. కరోనా తగ్గుతుంది.. షూటింగ్స్ మొదలెడమని అందరూ యదావిధిగా లాక్ డౌన్ ఆంక్షలను పాటిస్తూ సెట్స్ మీదకెళ్ళిన వాళందరూ ఇప్పుడు కరోనా భయంతో వణికిపోతున్నారు. సినిమాల సంగతి ఎలా ఉన్న సీరియల్స్ నటులు ఒక్కోక్కరిగా కరోనా సోకడంతో.. ఇప్పుడు సీరియల్స్ షూటింగ్స్ కూడా కష్టాల్లో పడ్డాయి. అంతేనా కామెడీ షో జబర్దస్త్ ని కూడా కరోనా తాకిడి తాకింది. ఇప్పటికే హైపర్ ఆది స్కిట్ లోని కొందరు కమెడియన్స్ కి కరోనా సోకడంతో అందరూ టెంక్షన్ లో ఉన్నారు.

ఈసారి గ్యాప్ బాగా వచ్చింది. ఈసారి ఎట్టిపరిస్థితుల్లో షో ఆగకూడదని.. వరసబెట్టి జబర్దస్త్ ఎపిసోడ్ చేసిన మల్లెమాల వాళ్ళకి లాభమే. కానీ కమెడియన్స్ లో మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పుడు టాప్ కమెడియన్స్ కి కూడా టెంక్షన్ పట్టుకుంది. ఇప్పటికే చాలామంది హోమ్ క్వారంటైన్ కి వెళ్లిన వారికీ ఇప్పుడు కరోనా భయం పెను భూతంలా పట్టుకుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా కరోనా ఎక్కడ సోకుతుందో అనే కంగారులో కమేడియన్స్ ఉన్నారని టాక్. కొంతమంది కొన్ని షెడ్యూల్స్ కి డుమ్మా కొడుతున్నారట. కొందరు బిక్కు బిక్కుమంటూ  షూటింగ్ కి హాజరవుతున్నారట. మరి ఎంతో ఉత్సాహం గా ఉన్న కమెడియన్స్ ఇప్పుడు ఉసూరుమంటూ కామెడీ చేస్తే.. ఆ కామెడీ బుల్లితెర ప్రేక్షకుల్లకు ఎంతవరకు చేరుతుందో అని మల్లెమాల టివి వారు కూడా కంగారు పడుతున్నారట.

Tags:    

Similar News