గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న అనంతరం.. కీరవాణి స్పీచ్
ముందుగా నా భార్యకి థ్యాంక్స్ చెప్పాలి.. నాకు ప్రతి విషయంలో తోడున్నందుకు. ఈ అవార్డు రావడానికి..
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ RRR వరుసగా ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుంటోంది. ఇప్పటికే డైరెక్టర్ రాజమౌళి.. బెస్ట్ డైరెక్టర్ గా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డును అందుకున్నారు. తాజాగా బెస్ట్ సాంగ్ గా.. నాటు నాటు పాటకు ఎంఎం కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్నారు. ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే ఈ అవార్డును ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకోవడంపై.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ.. RRR టీమ్ ను అభినందిస్తున్నారు.
ఇక ఈ అవార్డును అందుకున్న అనంతరం.. ఎంఎం కీరవాణి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. అవార్డు అందుకున్న అనంతరం.. కీరవాణి అదే వేదికపై మాట్లాడుతూ.. "ఈ అవార్డు నాకు అందించిన HFPA కి (హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్) ధన్యవాదాలు. ముందుగా నా భార్యకి థ్యాంక్స్ చెప్పాలి.. నాకు ప్రతి విషయంలో తోడున్నందుకు. ఈ అవార్డు రావడానికి కారణమైన మరికొందరికి థ్యాంక్స్ చెప్పాలి. ముందుగా ఈ సినిమా డైరెక్టర్ నా బ్రదర్ రాజమౌళి కి, అనంతరం ఈ పాటకి అద్భుతమైన డ్యాన్స్ సమకూర్చిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి, సాహిత్యం అందించిన చంద్రబోస్ గారికి, ఈ పాట పడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవకి, అద్భుతంగా డ్యాన్స్ చేసిన ఎన్టీఆర్, రామ్ చరణ్ కి అలాగే ఈ సాంగ్ కి ప్రోగ్రామింగ్ చేసిన సాలు సిద్దార్థ్, జీవన్ బాబులకి అలాగే శ్రీవల్లికి అందరికి ధన్యవాదాలు" అని తెలిపారు కీరవాణి.