సర్కారు వారి పాటకి కరోనా ఝలక్

కరోనా సెకండ్ వెవ్ విలయ తాండవం చేస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో సినిమాలు వాయిదా పడడం అటుంచి.. సినిమా షూటింగ్ లకి బ్రేకులు పడ్డాయి. మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో [more]

Update: 2021-04-19 04:42 GMT

కరోనా సెకండ్ వెవ్ విలయ తాండవం చేస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో సినిమాలు వాయిదా పడడం అటుంచి.. సినిమా షూటింగ్ లకి బ్రేకులు పడ్డాయి. మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో కరోనా కోరలు చాస్తుంది. రోజు రోజుకి కరోనా విజృంభణ పెరిగిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ మాట వినిపించకపోయినా.. కరోనా వస్తే ఇంట్లోనే కూర్చోవడం, లేదంటే హాస్పిటల్ కి పరుగులు పెట్టడం, అలాగే సినిమా షూటింగ్స్ లోనూ కరోనా సోకితే.. షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసి హోమ్ ఐసోలేషన్ కి వెళ్లిపోవడం ఇదే జరుగుతుంది. కొంతమంది కరోనా నిబంధనల మధ్యన షూటింగ్స్ చేసుకుంటున్నా.. సెట్ లో ఎవరో ఒకరు కరోనా బారిన పడడంతో మళ్ళీ షూటింగ్ లు ఆపేస్తున్నారు. ఇక తాజాగా మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ కూడా ఆగినట్లుగా తెలుస్తుంది.  
ఉగాది రోజున అన్ని జాగ్రత్తలతో సర్కారు వారి పాట సెకండ్ షెడ్యూల్ మొదలైంది. మహేష్ మాస్క్ పెట్టుకుని సర్కారు వారి పాట షూటింగ్ కి హాజరైన పిక్ ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. సెకండ్ షెడ్యూల్ ని గోవా లో ప్లాన్ చెయ్యగా సెకండ్ వేవ్ వలన అది హైదరాబాద్ లో నిర్వహించడానికి రెడీ అయిన సర్కారు వారి పాట టీం కి కరోనా ఝలక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సెట్ లో ఐదుగురికి కరోనా సోకడంతో ప్రజెంట్ సర్కారు వారి పాట సెకండ్ షెడ్యూల్ కి బ్రేకులు పడినట్లుగా తెలుస్తుంది. మహేష్, సెట్ లోని ప్రతి ఒక్కరూ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఇలా షూటింగ్ వాయిదా పడడంతో మహేష్ ఫాన్స్ అసహనంగా ఉన్నారు.

Tags:    

Similar News