ఇలా ఉంటే.. ఇంకేం వస్తారు!!

ప్రపంచంలో కరోనా తగ్గింది అనేది ఉత్తుత్తి మాటే. కరోనా కి మందు రాలేదు.. కరోనా తగ్గనూ లేదు. కాకపోతే ఆయా ప్రభుత్వాలు టెస్ట్ లు చెయ్యడం మానేసాయంతే. [more]

Update: 2020-10-17 07:18 GMT

ప్రపంచంలో కరోనా తగ్గింది అనేది ఉత్తుత్తి మాటే. కరోనా కి మందు రాలేదు.. కరోనా తగ్గనూ లేదు. కాకపోతే ఆయా ప్రభుత్వాలు టెస్ట్ లు చెయ్యడం మానేసాయంతే. అందుకే కోవిడ్ లెక్కలు తగ్గాయి. కానీ కరోనా మాత్రం విజృంభిస్తూనే ఉంది. ఎక్కడా కంట్రోల్ కి వచ్చిన దాఖలాలు లేవు. కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది కూడా. అయితే కరోనా ఉన్న భయపడకుండా చాలామంది హీరోలు తమ సినిమాల షూటింగ్ ని మొదలుపెట్టారు. అయితే ధైర్యంగా హీరోలైతే సెట్స్ మీదకెళ్ళి షూటింగ్స్ చేస్తున్నారు కానీ.. వారానికోసారి కరోనా టెస్ట్ ల్లో మూవీ యూనిట్స్ లో చాలామందికి పాజిటివ్ రావడంతో వారిని పంపేసి మిగతా వారితో షూటింగ్ కానిచ్చేస్తున్నారు.

కానీ సీనియర్ హీరోలైన బాలయ్య, చిరు, వెంకీ లు మాత్రం ఇలా కరోనా పాజిటివ్ లు చూసి అప్పుడే షూటింగ్ కి వెళ్ళాలి అనుకోవడం లేదట. యంగ్ హీరోలు కోవిడ్ వచ్చిన కేర్ చెయ్యని కారణముగా సెట్స్ మీద హడావిడిగా షూటింగ్స్ చేసుకుంటున్నారు. కానీ సీనియర్ హీరోలు అలా కాదు. కోవిడ్ వస్తే ప్రాబ్లెమ్ అనుకుని వారు అసలు రంగంలోకి దిగడం లేదు. కరోనా అంటే కంగారెందుకు అని కొందరంటుంటే.. కరోనాని లైట్ తీస్కోవద్దని కొందరంటున్నారు. అందుకే నవంబర్ నుండి షూటింగ్ అన్న హీరో లు చాలామంది ఇప్పుడు నవంబర్ లో షూటింగ్ మొదలెట్టడానికి సన్నద్ధంగా లేరని తెలుస్తుంది.

Tags:    

Similar News