అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్

ఆగష్టు 13న పుష్ప సినిమా రిలీజ్ డేట్ ఇచ్చాం.. ఎట్టి పరిస్థితుల్లో ఆ డేట్ ని రీచ్ అవ్వాలనే కసితో.. కరోనానిని కూడా లెక్కచెయ్యకుండా సుకుమార్ అండ్ [more]

Update: 2021-04-28 09:37 GMT

ఆగష్టు 13న పుష్ప సినిమా రిలీజ్ డేట్ ఇచ్చాం.. ఎట్టి పరిస్థితుల్లో ఆ డేట్ ని రీచ్ అవ్వాలనే కసితో.. కరోనానిని కూడా లెక్కచెయ్యకుండా సుకుమార్ అండ్ బన్నీ లు పుష్ప షూటింగ్ ని పరిగెత్తిస్తున్నారు. చాలా వరకు టాలీవుడ్ సినిమా షూటింగ్స్ బంద్ అయినా.. పుష్ప షూటింగ్ ఆగిన దాఖలాలు లేవు. కానీ ప్రస్తుతం పుష్ప షూటింగ్ కి బ్రేకులు వెయ్యకతప్పలేదు. కారణం కరోనానే. అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్ రావడంతో.. చేసేది లేక పుష్ప షూటింగ్ ని ఆపేసింది టీం. మెగా హీరోలు వరసగా కరోనా బారిన పడుతుండడం మెగా ఫాన్స్ ని కలవరపెడుతుంది. ఇప్పటికే రామ్ చరణ్ కరోనా వచ్చి తగ్గింది. తర్వాత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత చిరు చిన్నల్లుడు కళ్యాణ్ కి తాజాగా అల్లు అర్జున్ కి.
తనకి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టుగా ట్వీట్ చేసిన అల్లు అర్జున్.. ప్రస్తుతం తాను సేఫ్ గానే ఉన్నా అని, కరోనా పాజిటివ్ రావడంతో తాను హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయినట్టుగా ట్వీట్ చేసాడు. (Hello everyone! 
I have tested positive for Covid. I have isolated myself. 
I request those who have come in contact with me to get tested. 
I request all my well wishers and fans not to worry as I am doing fine .  Stay home, stay safe). కోవిడ్ ప్రొటొకాల్స్ పాటిస్తూ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లుగా తెలిపిన అల్లు అర్జున్.. అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని.. వ్యాక్సిన్ ఒక్కటే కరోనా నుండి కాపాడగలదని చెబుతున్నాడు అల్లు అర్జున్. ఇక తనకి కరోనా వలన ఇబ్బందులేం లేవని, తనని అభిమానించే ప్రేక్షక దేవుళ్లు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని ట్వీట్ చేసాడు.

Tags:    

Similar News