కోత నిజమేనంటారా?

ప్రస్తుతం కరోనా పరిస్థితికి సినిమా పరిశ్రమ పై 100 ల కోట్ల భారం పడింది. నిర్మాతలు నిట్ట నిలువునా మునిగిపోతున్నారు. విడుదల కావల్సిన సినిమాలు, షూటింగ్స్ మధ్యలో [more]

Update: 2020-07-07 10:53 GMT

ప్రస్తుతం కరోనా పరిస్థితికి సినిమా పరిశ్రమ పై 100 ల కోట్ల భారం పడింది. నిర్మాతలు నిట్ట నిలువునా మునిగిపోతున్నారు. విడుదల కావల్సిన సినిమాలు, షూటింగ్స్ మధ్యలో ఆగిపోయిన సినిమాలు, సినిమా షూటింగ్స్ మొదలవ్వాల్సిన సినిమాలు… అన్ని ఎక్కడికక్కడ సినిమా పరిశ్రమ మొత్తం స్తంభించిపోయింది. అయితే ఈ పరిస్థితి చక్కబడేవరకు హీరోల దగ్గరనుండి.. దర్శకులు, ఇతర నటులు, హీరోయిన్స్, టెక్నీకల్ డిపార్ట్మెంట్ మొత్తం తమ పారితోషకాలు తగ్గించుకోవాలని, సినిమా బడ్జెట్ లు తగ్గించాలని ప్రపోజల్స్ టాలీవుడ్ పెద్దల నుండి వచ్చింది. ఇప్పటికే దర్శకుడు పరశురామ్, కీర్తి సురేష్ లు తమ పారితోషకాల్లో కోత పెట్టుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇంకా చాలామంది నటులు కూడా ఈ విషయంలో ముందుకొచ్చారనే టాక్ ఉంది.

అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ పారితోషకంలో కోత పెట్టారనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సౌత్ లో అవకాశాలు లేక బాలీవుడ్ లో పాకులాడుతున్న రకుల్ ప్రీత్ కి కరోనా కష్టాలంటున్నారు. కరోనా కన్నా ముందే రకుల్ క్రేజ్ తగ్గింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేటు తగ్గించుకోవడమా? లేదంటే వేరే హీరోయిన్ ని వెతుక్కోవడమా? అనే ఆప్షన్ ని దర్శకనిర్మాతలు రకుల్ కి ఇస్తున్నారట. ఒకప్పుడు కోటిన్నర కూడా అందుకున్న ఈ రకుల్ ఇప్పుడు లక్షలకు పడిపోయింది అని.. కరోనా గడ్డుకాలంలో రకుల్ పారితోషకం మరింత దిగజారింది అనే టాక్ అయితే ఉంది. ఇప్పటికే నితిన్ రకుల్ పారితోషకంలో కోత పెట్టారని అంటున్నారు.

Tags:    

Similar News